శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఒక మహిళ కారణంగా ఇబ్బందులు..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్న సమస్యలు తగ్గు ముఖం పట్టి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో అధిక శ్రమ ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి శుభసమయం. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక విషయాల పట్ల ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో ఏ పనిలోనూ ముందడుగు వేయలేకపోతారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కోపావేశాలను అదుపులో ఉంచుకోకపోతే సన్నిహితులతో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజంతా సరదాగా, సంతోషంగా గడుపుతారు. ఊహించని ధనలాభాలను అందుకుంటారు. సామాజికంగా మంచి గుర్తింపు పొందుతారు. ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అనుకోని సవాళ్లు ఉండవచ్చు. కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తత ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు వుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాల కారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అవసరానికి ధనం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాలు అప్పులు చేయాల్సివస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాల కారణంగా మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. ఒక మహిళ కారణంగా ఈ రోజు మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. జలాశయాలకు దూరంగా వుండండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. కార్యసిద్ధి, విజయం మీ వెంటే ఉంటాయి. అంతటా విజయమే ఉండడం వల్ల సంతోషం విస్తరిస్తుంది. భూలాభం, వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఇంట్లో గొడవలు అశాంతిని కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలం కాదు. సహనంతో ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. వివాదాలకు, వాదనలకు దూరంగా ఉండండి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ ఫలిస్తాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. స్నేహితులు, బంధువులతో విహారయాత్రలకు వెళతారు.
కుంభం
కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో గొడవల కారణంగా అశాంతిగా ఉంటారు. ఆరోగ్యం సహకరించదు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి నిపుణులు, ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి సామాన్య ఫలితాలే ఉంటాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా తీరికలేని పనులతో అవిశ్రాంతంగా ఉంటారు. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధన వ్యయం ఉంటుంది. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉండదు.