Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప్ర‌యాణాల్లో ప్ర‌మాదం.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 16, 2025 6:15 AM IST
Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప్ర‌యాణాల్లో ప్ర‌మాదం.. జ‌ర జాగ్ర‌త్త‌..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శ్రమ పెరగవచ్చు. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు పాటించడం మేలు. ఆర్థిక పరిస్థితి మెల్లగా కుదుట పడుతుంది. కీలక వ్యవహారాలు నిర్లక్ష్యం చేయకండి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అనిశ్చితి, సందిగ్ధత చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో స్థిరాస్తులు, వారసత్వపు ఆస్తుల గురించిన చర్చలు వాయిదా వేయండి. కుటుంబ కలహాలతో విచారం తప్పదు. ప్రయాణాలలో ప్రమాదం ఉండవచ్చు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి సమయం నడుస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక లాభాలు పెరగడంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పట్టుదలతో ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల అండదండలతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభప్రదమైన కాలం నడుస్తోంది. దైవబలంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పెద్దల ఆశీర్వాద బలం అండగా ఉంటుంది. మీ ప్రతిభకు, తెలివితేటలకు గుర్తింపు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఆలోచించి ఖర్చు చేయండి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజు. వృత్తి పరంగా ఈ రోజు అనేక అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడుతాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పరోపకార గుణంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారంలో ధనలాభాలు ఉంటాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు అనుకూలమైన సమయం. కీలక చర్చల్లో అద్భుతంగా రాణిస్తారు. స్పష్టమైన ఆలోచనావిధానంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు, ఒత్తిడి వుండే అవకాశం వుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అదనపు ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు, రచయితలకు అనువైన సమయం. నూతన అవకాశాలు అందుకుంటారు. సన్మాన సత్కారాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విలాసాల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది.