Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగులకు ప‌దోన్న‌తులు..!

Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగులకు ప‌దోన్న‌తులు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో అన్ని పనులు చక్కబెడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఓ కీలక వ్యవహారంలో పురోగతి నిరాశ పరుస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణభారం, ఖర్చులు పెరగవచ్చు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి శుభ సమయం నడుస్తోంది. అన్నివైపుల నుంచి శుభ శకునాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు అనుకూలం.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలు రాబట్టుతారు. ఊహించని ధనలాభాలతో సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో విపరీతమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఇంటి వాతావరణం ఆనందోత్సాహాలతో ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కీలక విషయాలలో పెద్దల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉండవచ్చు. కోపాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. సోమరితనం, బద్దకం కారణంగా చేపట్టిన పనుల్లో పురోగతి లోపిస్తుంది. ఇతరులను అర్థం చేసుకోవడం అవసరం. సొంత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు ఆచి తూచి అలోచించి ముందడుగు వేయాలి. ఈ రోజు ఆస్తికి సంబంధించి లేదా కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం, విలువ ఇవ్వడం మంచిది. కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. చెడు పనుల మీదకు దృష్టి మరలకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలు, పరుషమైన మాటలు అదుపులో ఉంచుకోండి. కుటుంబ వ్యవహారాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీరు పట్టిన పట్టు విడవకుండుట వలన వ్యవహారాలన్నీ చెడిపోతాయి. మీ మాటల్తో సన్నిహితుల్ని బాధపెడతారు. సహనంగా ఉండటం నేర్చుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కార్యసిద్ధి, ఆర్థిక అనుకూలత ఉంటాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆదాయం పెరగడంతో ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. క్రమశిక్షణ, సమయ పాలనతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు పెడతారు. కోర్టు విషయాల్లో శ్రద్ద వహించండి. తీసుకునే నిర్ణయాలలో స్పష్టత ఉండేలా చూసుకోండి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. వ్యాపారపరంగా ఈ రోజు చాలా మంచి రోజు. అధిక లాభాలు అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు శుభప్రదం. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపారపరంగా చాలా అద్బుతమైన రోజు. ఉద్యోగులు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. మీ పై అధికారులు మీ పనికి తృప్తి చెందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సంతోషాన్ని కలిగిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.