Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగ‌, వ్యాపారాల్లో ఊహించ‌ని ఆర్థిక లాభాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 17, 2025 6:00 AM IST
Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగ‌, వ్యాపారాల్లో ఊహించ‌ని ఆర్థిక లాభాలు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఆనందమయంగా గడుస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలున్నాయి. చేపట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఒక వ్యవహారంలో ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు కష్ట కాలం.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషి చేస్తే విజయాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో సహచరుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో సహనం వహించండి. కలహాలు, ఘర్షణలు రాకుండా శాంతంగా ఉండడం అవసరం.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంది. ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్ఠమైన సమయం నడుస్తోంది. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. వృత్తి పరమైన సమావేశాలు, చర్చల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోబలంతో చేసే పనులు విజయవంతమవుతాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త వహించండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాలం శుభప్రదంగా ఉంది. ఏ పని తలపెట్టినా సులభంగా పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నది దక్కుతుంది. ఒక సంఘటన మీ మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభాలున్నాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరించడం మంచిది. తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సన్నిహితులతో ఆహ్లాదకర పర్యటనలు చేస్తారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్ మెంట్లు మొదలు పెట్టడానికి సరైన తరుణం. ఈ రోజు ప్రారంభించిన పనులు అదృష్టంగా పరిణమిస్తాయి. వ్యాపారులకు ఈ రోజు మంచి రోజు. శుభం జరుగుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి చేపట్టిన పనుల్లో ఆచి తూచి అడుగేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో పట్టుదల, నిబద్దత అవసరం. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. ఖర్చులు బాగా పెరుగుతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మితుల సహకారంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బలపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల లాభం పొందుతారు.