మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ తల్లి గారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు, పండితులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
మేషం : మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ తల్లి గారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు, పండితులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
వృషభం : వృషభరాశి వారు ఈరోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కొన్ని కఠిన సమస్యలను చాకచక్యంగా పరిష్కరించడం మీలో కొత్త శక్తిని నింపుతాయి.
మిథునం : మిథునరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయని గ్రహబలం చెబుతోంది. రోజు ప్రారంభంలో నిరాశ, నిస్పృహలకు లోనైనప్పటికీ రోజు ద్వితీయ భాగం అనుకూలంగా మారుతుంది. ఆర్థికపరమైన పనులకు తొలుత ఆటంకాలు కలిగినా తర్వాత సాఫీగా ముందుకు సాగుతాయి.
కర్కాటకం : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. నూతన అధికారాలు చేపట్టే అవకాశం రావడం వల్ల ఆనందంగా, సంతోషంగా ఉంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో శుభకార్యాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు.
సింహం : సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కొన్ని విషయాలు చికాకు కలిగించవచ్చు. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంది. ఒత్తిడి, ఉద్రిక్తతలు కూడా మానసికంగా ఇబ్బంది పెడతాయి. న్యాయపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది.
కన్య : కన్య రాశి వారికి ఈ రోజు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ, పరపతి నలుదిక్కులా వ్యాపిస్తుంది. ధనలాభం సూచితం. స్నేహితులు సహకరిస్తారు. సన్నిహితులతో సమయం గడపటం అనుకూలిస్తుంది.
తుల : తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లోనూ, పని ప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
వృశ్చికం : వృశ్చిక రాశి వారు ఈరోజు బద్ధకంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత లేకపోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. పిల్లల ప్రవర్తన బాధిస్తుంది. వారి ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది.
ధనుస్సు : ధనస్సురాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పెండింగ్ ప్రాజెక్టుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతానికి కొత్త పనులు చేపట్టకండి.
మకరం : మకర రాశి వారిని ఈరోజు అదృష్టం వరిస్తుంది. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మీరు చేసే పనిలో రాణిస్తారు. ఈరోజు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. సమాజంలో మీకంటూ గుర్తింపు సాధించగలరు. ఆనందంగా కాలం గడుపుతారు. గతంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించే సత్తా మీకుంది.
కుంభం : కుంభ రాశి వారికి ఈ రోజు కలిసివస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తద్వారా మీకు సంతోషంగా గడుపుతారు. ఇది మీకు పేరు, గుర్తింపును తెచ్చిపెడతాయి. మీకు సహకరించిన తోటి ఉద్యోగుల పట్ల కృతజ్ఞతతో ఉంటే మంచిది.
మీనం : మీన రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కలిసివచ్చే కాలం సమీపించడం వల్ల సంతోషంగా ఉంటారు. సాహిత్యం పట్ల ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థులు, పండితులు తమ రంగాల్లో రాణిస్తారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. జలగండం ఉంది. నదులు, సముద్రాల సమీపానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి.