చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఏ పని ప్రారంభించినా సరే తమ రాశుల ఫలితాలను బట్టి పనులను, శుభకార్యాలను ప్రారంభిస్తారు మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఊహించని ఆర్థిక లాభాలు ఈ రాశి వారు ఈ రోజు అందుకోబోతున్నారు.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కష్టకాలం. విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తివ్యాపారాల వారు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంలో ఉద్రేకపూరిత వాతావరణం ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. ఆదాయం సంతృప్తికరంగా ఉండదు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారిని చాలాకాలం తర్వాత కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల వారు ఆత్మ విశ్వాసంతో పనిచేసి మంచి విజయాలను అందుకుంటారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభతో అందరినీ ఆకర్షిస్తారు. ఇంటా బయటా అందరి ప్రశంసలు పొందుతారు. సమర్ధవంతంగా పనిచేసి విజేతగా నిలుస్తారు. మీ పోటీదారులు తమ ఓటమిని అంగీకరించి పక్కకు తప్పుకుంటారు.
కన్య
కన్యా రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ప్రియమైన వారితో అనుభంధాలు దృఢ పడతాయి. మీ సన్నిహితులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయికి మీరు ఎదుగుతారు. అసూయపరులతో జాగ్రత్తగా ఉండండి. అనేక మార్గాల ద్వారా ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి.
తుల
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. తగినంత విశ్రాంతి అవసరం. చిన్న చిన్న విషయాలకు చికాకు పడుతుంటారు. కోర్టు వ్యవహారంలో వ్యతిరేకత ఉంటుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు తారాబలం అద్భుతంగా ఉంది. వృత్తి వ్యాపారాల వారికి, ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. బంధుమిత్రులతో విహారయాత్రకు వెళతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అహంకారులకు దూరంగా ఉంటే మంచిది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఆర్ధికంగా బలపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతం పెరుగుదల ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారులకు కలిసివచ్చే కాలం. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణానికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. దైవదర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు కొంత వ్యతిరేకంగా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు. ఇతరులతో వాదనకు దిగకపోవడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఇంట్లోని వాతావరణం ఆందోళనకరంగా ఉంటుంది. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఆర్ధిక నష్టం కూడా ఉండే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠించండి.