బ్యాలెట్ పద్ధతిలో స్థానిక ఎన్నికలు..ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది.

బెంగళూరు : కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. గత అనుభవాలను, అంతర్జాతీయంగా అనుసరిస్తున్ననమూనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలన్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఈ నిర్ణయంపై బీజేపీ ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని డీకే శివకుమార్ చెప్పారు. బ్యాలెట్ అనగానే బీజేపీ ఎందుకు వణుకుతున్నదని ఆయన ప్రశ్నించారు. బ్యాలెట్‌తో ఎన్నికలకు వెళ్లడంపై బీజేపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఓడినప్పుడల్లా ఈవీఎంలనే బద్నాం చేస్తున్నదని బీజేపీ ఆరోపించింది.