ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారి జీవితంలో ఈ రోజు అద్భుతాలే..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో మీ మాటే చెల్లుబాటు కావాలన్న మొండి పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంబిస్తే మేలు. సమిష్టి నిర్ణయాలతో మేలు జరుగుతుంది. కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కోపం అదుపులో పెట్టుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాలి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ధన లాభం ఉంటాయి. అంతటా శుభఫలితాలు ఉండడంతో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. మీ ప్రియమైన వారితో, సన్నిహితులతో అనవసరంగా వాదిస్తారు. ఎవరికీ చెప్పుకోలేని, మీకు మాత్రమే తెలిసిన కొన్ని కారణాల వల్ల చికాకుగా, కోపంగా ఉంటారు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. గతంలో కంటే మీ ఆదాయ వనరులు పెరిగి ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం కలిసికట్టుగా ఈ రోజు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత ఉంది. సింహారాశి వారి సహజంగా ఉండే అపరిమితమైన బలం సామాజికంగా మంచి గుర్తింపు తీసుకువస్తుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఒక్క ప్రతికూలత కూడా లేని శుభకరమైన రోజు. చిన్ననాటి స్నేహితులతో కలుసుకుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. శుభ సమాచారంతో ఈ రోజంతా సంతోషంగా, సరదాగా గడిచిపోతుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కోపావేశాలతో తీవ్రమైన పదజాలంతో మాట్లాడి సన్నిహితులను బాధిస్తారు. కోపం తగ్గాక ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అనవసరంగా సంబంధాలు దెబ్బ తింటాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో తీవ్రమైన కృషి చేసి అనుకున్నది సాధిస్తారు. మీ లక్ష్య సాధనకు మార్గం సుగమం చేసుకుంటారు. తీరికలేని పనుల నుంచి కొంత విరామం తీసుకొని కుటుంబంతో సరదాగా గడపండి. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. తారాబలం అనుకూలించి అదృష్టం అవకాశాలుగా మారి మీ ఇంటి తలుపు తడుతుంది. మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉంటారు. కాలం కలిసివచ్చి చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ విజయంతో ప్రత్యర్ధులు తమ ఓటమిని అంగీకరిస్తారు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాలు అనుకూలించవు. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. పిల్లల ఆరోగ్యం ఆందోళన కరంగా ఉంటుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మొండి పట్టుదల, దూకుడు తగ్గించుకోవాలి. కోపావేశాలపై అదుపు సాధించాలి. కుటుంబ సభ్యులతో కలహాల కారణంగా జీవితం సాఫీగా గడవదు. ఇల్లు, ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టపడి పనిచేస్తేనే, విజయాన్ని పొందగలుగుతారు. సృజనాత్మకతతో పనిచేసి వృత్తిలో మీదంటూ ఖచ్చితమైన ముద్ర వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సమర్ధవంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని త్వరలో అమలు కూడా చేస్తారు. స్నేహితులతో సాహసోపేతమైన పర్యటనకు ప్రణాళికలు వేస్తారు.