Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో గొప్ప మార్పులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 21, 2025 6:03 AM IST
Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో గొప్ప మార్పులు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. అందుకే చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలోనూ తొందరపాటు వద్దు. ప్రశాంతంగా అలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిపై దృష్టి సారించండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి గోచరిస్తోంది. ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శత్రుభయం తొలగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు పెడతాయి. ఓ సంఘటన మనస్థాపం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు చోటు చేసుకోవచ్చు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన అవకాశాలతో అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. వ్యాపారులకు అనుకూలమైన సమయం. లాభాలు పెరగడంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతినడంతో అశాంతిగా ఉంటారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో నడుచుకుంటే బంధాలు బలపడాతాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో చురుగ్గా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో, నాయకత్వ లక్షణాలతో సమాజంలో మీకంటూ ఒక గొప్ప గుర్తింపు, గౌరవం పొందుతారు. ఆర్థికంగా శ్రేష్టమైన సమయం.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సరైన ప్రణాళికతో పనిచేస్తే ఉహించినదానికన్నా అధిక ఫలితాలు సాధించవచ్చు. సన్నిహితుల సహకారం ఉంటుంది. కీలక విషయాల్లో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయడం మంచిది. చేసే పనుల్లో, చెప్పే మాటల్లో స్పష్టత ఉంటే విజయం సులువుగా లభిస్తుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ధనప్రవాహం పెరుగుతుంది. ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితం అవుతారు. కుటుంబ వ్యవహారాల్లో సమతుల్యత పాటించడం మంచిది. అపార్ధాలు రాకుండా మాట అదుపులో ఉంచుకోండి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. అనుభవంతో, బుద్ధిబలంతో వ్యవహరిస్తే కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనం అవసరం. ఎవరి మనసు నొప్పించేలా మాట్లాడవద్దు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలతో ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. కుటుంబపరమైన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు సునాయాసంగా అధిగమిస్తారు. పెద్దల ఆశీర్వాద బలం అండగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉన్నత పదవులు అధిరోహిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో సమయానుకూల నిర్ణయాలు మేలు చేస్తాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. మీ కృషి, పట్టుదల ఫలిస్తుంది. సృజనాత్మక ఆలోచనలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం, ఆలస్యం దూరం చేస్తే మంచిది. కుటుంబ సమస్యలు ఆందోళనకరంగా మారుతాయి. సహనం పాటించి, ఓర్పుతో ఉంటే అంతా మంచి జరుగుతుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి.