24.05.2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆర్థిక విష‌యాల్లో శుభ‌ఫ‌లితాలు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 24, 2024 / 06:48 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పెద్దగా మార్పు ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బందులు పెట్టే వ్యక్తులను పట్టించుకోకండి. మీరు సహనంతో ఉంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారులు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతకాలం వేచి ఉండటం మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార నిపుణులకు ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. స్థిరాస్తి,మార్కెటింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు ఊహించిన దాని కంటే ఎక్కువ ధనలాభాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం విషయంలో ఆందోళనతో ఉంటారు. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. అనారోగ్య సమస్యల వలన చికాకుతో ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. లేకుంటే అనవసర కలహాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలకు మంచి సమయం. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈ రోజు మీరు చురుగ్గా, లౌక్యంగా పనిచేసి పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళతారు. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. పెద్దల సూచనలు పాటించడం మంచిది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో పేరున్న గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగులు పని ఒత్తిడి ఉన్నా సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. వృత్తి వ్యాపార నిపుణులకు అన్నింటా విజయం ఉంది. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నూతన వాహన యోగం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. లేకుంటే అపార్థాలకు అవకాశం ఉంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులు పనిలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు. వ్యాపారులకు తోటి వ్యాపారుల నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పును ఈ రోజు చూస్తారు. కీలకమైన విషయాలలో ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. సహనంతో ఉంటే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కుటుంబంలో గొడవల కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి.

Latest News