Today Horoscope | శనివారం రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆచి తూచి నడుచుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఆలస్యమయినా సహనంతో ఉండండి. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఆర్ధిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్త వహించండి. చట్టపరమైన, కోర్టుకి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. లాభాలు పెరగడమే కాకుండా, పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల సందేహాలు, అనుమానాలు తొలగిపోతాయి. కెరీర్లో నూతన అవకాశాలు అందుకుంటారు. మీ పరోపకార గుణంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆర్ధికంగా ఎదగడానికి చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. శతృప్రభావం ఎక్కువగా ఉంటుంది. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. వృత్తి ఉద్యోగాలలో సమయానుకూలంగా నడుచుకోవడం వలన పనులు ఆలస్యం కావు. కుటుంబ వివాదాలకు అవకాశం ఉంది. పరిస్థితిని అంచనా వేస్తూ పరిపక్వతతో వ్యవహరించండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. అన్ని విజయాలు ముందు నిర్ణయించినవే. మీ విజయరహస్యాలను ఇతరులతో పంచుకోండి. సామాజిక పరిచయాలు ఊహించని రీతిలో పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మీడియా రంగం వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పనిపట్ల మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ఆర్ధికంగా సానుకూల ఫలితాలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశముంది. వ్యాపారంలో డబ్బు నష్టం సంభవించకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ప్రజాసంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. కోపావేశాలపై అదుపు సాధించండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. వృత్తి నిపుణులు తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. విశేషమైన ధనలాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది.