గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అన్ని వైపుల నుంచి ధ‌న ప్ర‌వాహం..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అన్ని వైపుల నుంచి ధ‌న ప్ర‌వాహం..!

మేషం

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన పనుల్లో అపజయాలు జరిగే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి మంచికి పొతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఎటు చూసినా సమస్యలే ఉండడటంతో మానసిక ఆందోళనకు గురవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక మనస్థాపం చెందుతారు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్ళను అవకాశాలుగా మలచుకొని కెరీర్ లో ముందుకు దూసుకెళ్తారు. ఎదురయ్యే ప్రతి సవాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కుటుంబ వ్యహారాలు పట్ల సున్నితంగా, ఎమోషనల్ గా ఉంటారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి మందకొడిగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక వృద్ధి స్థిరంగా, నిదానంగా ఉంటుంది. పనుల్లో ఆలస్యమయినా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నవన్నీ సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో చెప్పుకోతగ్గ పురోగతి ఉండదు. విమర్శకుల మాటలకూ ప్రాధాన్యత ఇవ్వొద్దు. కఠినమైన మాటలతో ఎవరినీ దూషించవద్దు. సన్నిహితులతో వాదనతో కూడిన చర్చలకు దూరంగా ఉండండి.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభ ఫలితాలు ఉంటాయి. మీ ఖ్యాతి, ప్రజాదరణ నలువైపులా విస్తరిస్తుంది. స్నేహితుల సహాయంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పడుతాయి. లక్ష్మీకటాక్షం ఉండటంతో అన్ని వైపుల నుంచి ధనప్రవాహం ఉంటుంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదగడానికి అన్ని విధాలా అనుకూలమైన రోజు. ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో తీరికలేని పనులతో సతమతమవుతారు. తగిన విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. పని పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తీవ్రమైన భావోద్వేగాలతో మానసిక సంఘర్షణకు లోనవుతారు. వృత్తిలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారానికి సహచరుల సహాయాన్ని కోరుతారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మీ మనోభీష్టానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతిదానికి సున్నితంగా స్పందించే మీ స్వభావం అవకాశవాదులకు అనుకూలంగా మారే ప్రమాదముంది. మీ విజయానికి మీ స్వభావమే ఆటంకంగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి అడుగు వేయడం అవసరం. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే ప్రమాదముంది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాలవారికి చేపట్టిన పనుల్లో విజయం, కీర్తి, గుర్తింపు ఉండవచ్చు . అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అందరితో సత్సంబంధాలు పెంచుకుంటారు. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.