Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు క‌ల్యాణ‌యోగం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Oct 24, 2025 6:00 AM IST
Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు క‌ల్యాణ‌యోగం..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకెళ్లి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి కోసం చేసే కృషి ఫలప్రదం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచికాలం కొనసాగుతోంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రశాంతతనిస్తుంది. కలహాలు, వివాదాలకు దూరంగా ఉండండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ తెలివితేటలతో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి ఉంది. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో దూరదృష్టితో వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. అనవసర చర్చలు, అపోహలకు దూరంగా ఉంటే మంచిది. చేపట్టిన పనుల్లో శ్రద్ధ పెంచడం అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో తెలివిగా నడుచుకోవాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. మెరుగైన అవకాశాలతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. స్థిరాస్తి డాక్యుమెంట్ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు ఈ రోజు అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. అమానకర సంఘటనలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులపై నియంత్రణ అవసరం.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మానసికంగా ఆందోళనతో ఉంటారు. అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ విషయాల్లో మొండి వైఖరి విడిచి అవగాహనతో మెలగండి. ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పైఅధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వ్యాపారంలో అనేక సవాళ్లు ఉండవచ్చు. సంయమనం పాటించండి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా మీ అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పట్టుదలతో ఆటంకాలు అధిగమిస్తారు. శ్రద్ధ, దీక్షతో విజయాలు సునాయాసంగా లభిస్తాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వ్యాపారులు, వృత్తినిపుణులు ఊహించని శుభలాభాలు పొందుతారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టలక్ష్మి వరిస్తుంది. సౌభాగ్యం, సంపద పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కీలక వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి.