నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

మేషం

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీ ముక్కుసూటి తత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భావోద్వేగాలను నియంత్రించడం ఈ రోజు సవాలుగా మారుతుంది. మీ ప్రత్యర్ధులు మీ బలహీనతలను అవకాశంగా మలుచుకునే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా అనేక ఆందోళనలు, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. మీ బుద్ధిబలంతో అన్ని సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఆందోళన తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అందరిని సంతోషపెట్టడానికి అలుపెరగని పోరాటం చేస్తారు. సానుకూల వైఖరితో చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని సంఘటనలు ఎదురుకావడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి పరంగా ప్రత్యర్ధులు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా శుభ సమయం నడుస్తోంది. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఊహించని లాభాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్టం కలిసివచ్చి చేపట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి పోరాడి అలిసిపోతారు. మనోబలం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. వ్యాపారంలో కూడా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఈ రోజంతా ఊహించని సంఘటనలు, సమస్యలతో నిండిపోయి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరగడంతో తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు అదృష్టవంతులు అవుతారు. ఈ రోజు ఏ పని చేసినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయపథంలో పయనిస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. అదృష్టం కలిసివచ్చి ఆదాయం పదింతలు పెరుగుతుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు అన్నివిధాలా శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉన్నందున అన్ని రంగాల వారు వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.