Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ యోగాలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. వృత్తి పరంగా ఒక సువర్ణావకాశం ఈ రోజు మీ ఇంటి తలుపు తడుతుంది. ఆర్థికంగా విశేషమైన లాభాలు అందుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసానికి భంగం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి. కుటుంబ కలహాలు రాకుండా కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ యోగాలున్నాయి. కీలక వ్యవహారంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. సమాజంలో పరపతి, పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నలుగురికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ప్రగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రశాంతతనిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా ఈ రోజు బ్రహ్మాండమైన రోజు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు రావాలంటే తీవ్రంగా శ్రమించాలి. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఊహించని ప్రమాదాలు ఉండవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. లక్ష్య సాధనలో ఆటంకాలు ఏర్పడుతాయి. అనవసర చర్చలతో కాలయాపన చేయకుండా లక్ష్య సాధనపై దృష్టి సారిస్తే మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో చిత్తశుద్ధి, నిజాయతితో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. బంధువులతో అపార్ధాలు రాకుండా జాగ్రత్త వహించండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు కచ్చితంగా ఉంటాయి. గ్రహాల సానుకూలతతో సునాయాసంగా లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. విశేషమైన ఆర్థిక లబ్ధి ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సహనంతో ఉంటే మంచిది. సరైన ప్రణాళిక ఉంటే ప్రారంభిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.