మేషరాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆవేశానికి లోను కావద్దు. శివారాధన మేలు చేస్తుంది.
మేషం
మేషరాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆవేశానికి లోను కావద్దు. శివారాధన మేలు చేస్తుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కొన్ని ఎదురుచూడని సంఘటనలు ఎదురయ్యి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇది మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. దేవుని ఆశీస్సులతో ఎదురుదెబ్బలు తట్టుకొని స్థిరంగా ముందుకు సాగుతారు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీకు నచ్చినట్లుగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వినాయకుని ప్రార్ధన మేలు చేస్తుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనుకోని సంఘటనల కారణంగా ఆందోళనకు గురవుతారు. పరిస్థితులు అనుకూలించవు. అయితే మీ సమయస్ఫూర్తితో క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తారు. కష్టపడితేనే విజయం లభిస్తుందని గుర్తుంచుకోండి. ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. గ్రహాలు అనుకూలిస్తాయి. జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకోడానికి కృషి చేస్తారు. దేవి దర్శనం శుభప్రదం.
కన్య
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. విఘ్నేశ్వరుని ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
తుల
తులరాశి వారికి ఈ రోజు కలిసివస్తుంది. ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కోసం పెట్టుబడులు సేకరించే ప్రయత్నంలో ఉంటారు. మీ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓర్పుతో, నేర్పుతో మెలగాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం అంతగా సహకరించదు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు వేచి చూసే ధోరణి అవలంబిస్తే మేలు. దుర్గాధ్యానం మేలు చేస్తుంది.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంట్లో గొడవలతో ప్రశాంతత దెబ్బతింటుంది. సంతానం పట్ల ఆందోళనకు గురవుతారు. ఇతరుల కారణంగా ఇంట్లో కలహాలు ఉంటాయి. పరిస్థితి చక్కబడే వరకు మౌనం పాటిస్తే మంచిది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. చక్కని ప్రణాళికతో, ముందుచూపుతో వ్యవహారిస్తారు. కానీ గ్రహలు అనుకూల స్థితిలో లేని కారణంగా పనులు అంత ప్రభావవంతంగా సాగవు. సహనంగా ఉండటం మంచిది. మార్పు, పురోగతి కోసం వేచి చూడాలి. వినాయకుని ధ్యానం మేలు చేస్తుంది.