Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే చేపట్టిన పనులు సఫలం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు తమ ప్రత్యర్థులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా సాగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు ఉంటాయి. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో మెలిగితే లక్ష్య సాధన సులువవుతుంది. వ్యాపారులు సమయానుకూలంగా నడుచుకుంటే కీలక ఒప్పందాలు సొంతమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సహనం అవసరం. ఖర్చులు నియంత్రించుకోవాలి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి పరంగా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. తలపెట్టిన అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. స్నేహితుల ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సంకల్పసిద్ధి ఉంది. అన్ని పనులు స్వల్ప ప్రయత్నంతోనే పూర్తవుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శుభవార్తలు అందుకుంటారు. మీ సంతోషాన్ని కుటుంబంతో పంచుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి పరమైన శుభవార్తలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు పనిచేస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ధనయోగం అనుకూలంగా ఉంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పిత్రార్జితం ద్వారా లబ్ది పొందుతారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి కావాలంటే పట్టుదల అవసరం. బద్ధకం, నిర్లక్ష్యం వీడి కృషి చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా చూసుకోండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం మొదలైంది. మీ ఆశయాలు, సంకల్పాలు నెరవేరుతాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. భవిష్యత్తు ప్రణాళికలకు కాలం అనుకూలంగా ఉంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, మనస్పర్థలు చోటు చేసుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram