Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి భూ, గృహ‌, వాహ‌న యోగం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 02, 2025 6:29 AM IST
Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి భూ, గృహ‌, వాహ‌న యోగం..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో వివాదాలకు దూరంగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు అందుకోగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది. అన్ని రంగాల వారు తమ అంచనాలకు మించిన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. మీ కృషి పట్టుదలతో ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. కీలక నిర్ణయాల విషయంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో శుభ లాభాలున్నాయి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో బలమైన యోగాలున్నాయి. మీ మాటకు గౌరవం, విలువ పెరుగుతాయి. ఉద్యోగంలో పదవి యోగం ఉంది. పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టయోగం పట్టనుంది. చేపట్టిన ప్రతిపనిలోను విజయం దక్కుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. ఆదాయం ఆశించిన మేరకు పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దానధర్మాలతో సమాజంలో ఖ్యాతి గడిస్తారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు శుభ సమయం. లాభాలు గణనీయంగా పెరుగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సత్వర విజయం చేకూరుతుంది. ఎంత క్లిష్టమైన సమస్య అయినా చిటికెలో పరిష్కరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత యోగం, కీర్తి, విజయం లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో మనోబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. రుణసమస్యలు పెరగకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో స్వీయ నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి నిరాశ పరుస్తుంది. పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో నష్టభయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా సరైన ప్రణాళిక అవసరం.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. ఉద్యోగంలో విజయం, గుర్తింపు ఉంటాయి. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి యోగం ఉంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభ యోగాలున్నాయి. ఆర్థికంగా ఐశ్వర్యం చేకూరుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. నిరంతర శ్రమతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. దైవబలం సంపూర్ణంగా ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు.