Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారి కుటుంబంలో శుభకార్యాలు..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కష్ట కాలం. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి పరంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉంటే మంచిది. ఒక వ్యవహారంలో ఆర్థిక నష్టం కలగవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారిని కలుసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి, పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలా మంచిది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా కొంత పరవాలేదు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో అనవసర కలహాలు చోటు చేసుకుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార లాభాలున్నాయి. సన్నిహితులతో కలిసి పర్యటనలు చేస్తారు. స్నేహితులతో అనవసర వాదనలు మానుకోండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మంచి ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు మంచి రోజు. అన్నింటా శుభం జరుగుతుంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవాలయ దర్శనానికీ, తీర్థయాత్రలకు అనువైన సమయం. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభ వర్తమానం వింటారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా ఒక సువర్ణావకాశం ఈ రోజు అందుకుంటారు. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే సూచన ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే మీకు అంతటా విజయమే.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంది. సన్నిహితులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. వ్యాపారంలో సానుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బలపడతారు.