Horoscope | మంగళవారం రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబ వేడుకల్లో మునిగితేలుతారు. ఊహించని విజయం మీ తలుపు తడుతుంది. వృత్తి పరంగా సువర్ణావకాశం అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి అందిన శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వ్యాపారులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సంతోషం కోసం పనిచేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ పరోపకార గుణంతో సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించడం కష్టతరమవుతుంది. ఆశావాద దృక్పధంతో కార్యసిద్ధి ఉంటుంది. వృధా ఖర్చులు నివారించండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులు వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీ జీవితంలో అనుకోని మలుపు చోటు చేసుకుంటుంది. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలు తమ భాగస్వాములతో సత్సంబంధాలు కలిగి ఉంటే మంచిది. సన్నిహితులతో విలువైన సమయం గడుపుతారు. ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణిస్తుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీడియా, పత్రికా రంగం వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ నైపుణ్యానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభకు గుర్తింపు పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్థికంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార సంబంధిత పనులపై చేసే ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. సన్నిహితుల నుంచి విలువైన కానుకలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కృషి, పట్టుదలతో ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు అదుపు చేస్తే మంచిది. కుటుంబంలో శాంతి నెలకొల్పడం కష్టసాధ్యమవుతుంది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారంలో ఊహించని నష్టం ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రణాళికలన్నీ తలకిందులవుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోండి. ఊహించని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ధనధాన్య లాభాలున్నాయి. కీలక వ్యవహారాల్లో మీ నిర్ణయాలు అందరికీ మార్గదర్శకం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొనడం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో సర్వత్రా విజయాలు చేకూరుతాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ పెద్దల ఆశీర్వాద బలంతో అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram