06.05.2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • By: raj |    devotional |    Published on : May 06, 2024 6:35 AM IST
06.05.2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం కోసం వేచి చూడండి. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అజాగ్రత్తతో ఉంటే నష్టం వాటిల్లుతుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మంచి లాభాలను అందుకుంటారు.

మిథునం

మిధునరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్థులు శుభవార్తలు వింటారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఎంతో చేయాలనుకుని ఏమి చేయలేకపోతారు. ఆరోగ్యం సహకరించదు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే మేలు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక మలుపులు జరుగుతాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. వైద్యం కోసం ధనవ్యయం ఉంటుంది. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు విశేషమైన ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. ఖర్చులతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రులతో తీర్థయాత్రలకు వెళతారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో శాంతి ఉండాలంటే మీరు మౌనంగా ఉంటే మేలు. అనవసర విషయాల్లో తలదూర్చి వివాదాలు తెచ్చుకోవద్దు. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనుకోని అనారోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు రావడం వల్ల అశాంతికి లోనవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతికూల ఆలోచనలు వీడితే మేలు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనవసర కోపం, ఆవేశం కారణంగా కలహాలు ఉంటాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. ఇంటా బయట అశాంతిగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.