శనివారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణయోగం..!
Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కీలక వ్యవహారాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. శుభకార్యాల్లో ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్ధిక సమస్యలతో విసుగుచెందుతారు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ధర్మసిద్ధి, మనఃసౌఖ్యం ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పదోన్నతులు పొందుతారు. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. గొప్ప ఆత్మవిశ్వాసంతో కీలకమైన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పాజిటివ్ ఎనర్జీతో అడుగు పెట్టిన ప్రతి చోటా విజయమే వరిస్తుంది. సహచరుల సహకారం ఉంటుంది. ఇంటి వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలలో విపరీతమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులు నుంచి, ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. సన్నితులతో మంచి సమయాన్ని గడుపుతారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో చిన్న, చిన్న గొడవలతో మనశ్శాంతి ఉండదు. ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయ వృద్ధి మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరంభించిన పనుల్లో ఆటంకాలను సమర్ధవంతంగా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతాయుతంగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉండవచ్చు. ఈ రోజు ఆస్తికి సంబంధించి లేదా కోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా ఉంటాయి. క్రమశిక్షణ, సమయ పాలనతో సత్ఫలితాలు అందుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడే విధానం సౌమ్యంగా, మర్యాదగా ఉండేలా జాగ్రత్త పడండి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో వినయ విధేయతలతో ప్రవర్తిస్తే మంచిది. నిరాశావాదం వీడి సానుకూల ఆలోచనలతో ముందుకెళ్లడం అవసరం. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళ్తారు. చేపట్టిన పనులను చక్కని ప్రణాళికతో పూర్తిచేస్తారు. సన్నిహితులతో గడపడంతో సంతోషకరమైన అనుభూతి చెందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. బంధు మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం. ఇతరులు ఈర్ష్య చెందేలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్ధికంగా శుభయోగం ఉంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతిపనిలోను విజయం చేకూరుతుంది. కొత్త అసైన్మెంట్లు, ప్రాజెక్టులు చేపట్టడానికి శుభప్రదమైన రోజు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన రోజు. మంచి లాభాలు అందుకుంటారు. మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి. ధనయోగం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంది.