Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణ యోగం..!
Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ మాటకు తిరుగుండదు. ఆర్థిక లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన సమయం. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం బాగుటుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో సహనం, ఓర్పు అవసరం. ఆశించిన ఫలితాలు ఆలస్యమైనా సత్ఫలితాలనే అందుకుంటారు. అవివాహితులకు కల్యాణయోగం ఉంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో సమయాన్ని వృథా చేయవద్దు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పరోపకారంతో, చిత్తశుద్ధితో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులకు ఆస్కారం ఉంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనా వెనుకంజ వేయవద్దు. మనోధైర్యంతో చేసే పనులు లాభాలనిస్తాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమిస్తారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి పరమైన ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మంచి అనుకూలమైన సమయం నడుస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ సునాయాసంగా విజయం సాధిస్తారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సంపద పెరుగుతుంది. సమిష్టి నిర్ణయాలతో భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. నూతన వస్త్రవాహనాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
తుల
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం మంచిది. ఇంటా బయటా వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదముంది. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. ఒక కీలకమైన విషయంలో సానుకూల ఫలితం రావడం ఆనందం కలిగిస్తుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ సత్ఫలితాలు ఉంటాయి. లక్ష్మీకటాక్ష యోగం ఉంది. సంపదలు వచ్చి చేరుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. వ్యాపారంలో ఆశించిన ఫలితాల కోసం కృషి చేయాలి. కర్తవ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక ఆహ్లాదకరమైన పర్యటనకు అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు, విద్యార్ధులకు ఈ రోజు అనుకూలంగా ఉండవచ్చు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల శుభ ఫలితాలు ఉంటాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. అవనసరపు వ్యయాలు చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయటా సమస్యాత్మకమైన పరిస్థితులు ఉంటాయి. ఓర్పు, నేర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోవద్దు. నమ్మించి మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ప్రమాదాలున్నాయి కాబట్టి వాయిదా వేయండి. ధార్మిక కార్యకలాపాలు, తీర్థయాత్రలపైన అధికంగా ఖర్చు చేస్తారు.