Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మానసికంగా కొంత విచారంగా ఉంటారు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా కలత చెందుతారు. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారిస్తారు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి నిరుత్సాహపరుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దు. పట్టుదలతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఖర్చులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. అద్భుతమైన గ్రహబలంతో చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఇంటా బయట మంచి పేరు సంపాదిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సహకారం ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతుల సూచన ఉంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. భూ,గృహ, వాహన యోగాలున్నాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరగవచ్చు. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ పరంగా, వృత్తి పరంగా ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఖర్చులు పెరిగే ప్రమాదముంది. ఆస్తి వ్యవహారాలు, కోర్టుకు వ్యవహారాల్లో ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సమాచారం అనుకూలంగా లేదు కాబట్టి చేసే పనులు, మాట్లాడే మాటల్లో సంయమనం పాటించాలి. పట్టుదల ఉంటే ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించవచ్చు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలు కుటుంబ సభ్యుల సహకారంతో తొలగిపోతాయి. దైవబలం అండగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సంయమనం అవసరం.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహస్థితి సామాన్యంగా ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ముందు జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపారపరంగా ఈ రోజు చాలా మంచి రోజు. పట్టిందల్లా బంగారం అవుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. కొత్త వారితో పరిచయమయ్యే అవకాశం వుంది. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు అద్బుతమైన రోజు. మీ ప్రతిభకీ, పనితీరుకు తగిన గుర్తింపు వస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం వుంది. కుటుంబంలో నెలకొన్న సంతోషకరమైన వాతావరణం ఆనందం కలిగిస్తుంది.