Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వ్యాపారులకు పట్టిందల్లా బంగారమే..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనేక సంఘటనలు ఈ రోజు జరుగుతాయి. వృత్తి పరంగా శ్రమ పెరగవచ్చు. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలిస్తోంది కాబట్టి మీరు చేసే ప్రతీ పనిలో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. స్థిరాస్తి లావాదేవీలు, షేర్ మార్కెట్ పెట్టుబడులు లాంటి వాటన్నిటికీ గొప్పగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రతతో ముందుకెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. పనిప్రదేశంలో వివాదాలకు దూరంగా ఉండాలి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యహారాల్లో విజయం సాధిస్తారు. ముందుచూపుతో వ్యవహరిస్తే ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ తగ్గుతుంది. ఒక వ్యవహారంలో మీ కృషికి ధనలాభాలు అందుకుంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ సర్దుకుంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ప్రారంభించిన పనుల్లో సత్ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. కీలక సమావేశాలు, చర్చల్లో రాణిస్తారు. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. ఆర్థిక అంశాలలో అనుకూలత ఉంటుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా కలుగుతున్న అపజయాలకు కృంగిపోవద్దు. కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రయణాలు వాయిదా వేసుకోండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నిర్లక్ష్య వైఖరీ కారణంగా నష్టపోయే ప్రమాదముంది. కల్లోలంగా ఉన్న కుటుంబ వాతావరణంతో మీరు మానసికంగా విచారం చెందుతారు. ఆరోగ్యం క్షీణించడంతో మరింత దిగులు చెందుతారు. చేపట్టిన పనుల్లో శక్తీ, ఉత్సాహం కోల్పోకుండా జాగ్రత్త పడండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాటలతో ఎవరినీ నొప్పించకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య అపార్ధాలకు తావు లేకుండా జాగ్రత్త పడండి. వ్యాపారులు నూతన ఒప్పందాలకు దూరంగా ఉంటే మంచిది.