Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి బంధువుల‌తో వివాదాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Jan 10, 2026 6:00 AM IST
Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి బంధువుల‌తో వివాదాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. అన్ని వైపులా నుంచి సంపదలు పోటెత్తుతాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో మీ ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సత్ప్రవర్తనతో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. నిరాశ చెందకండి. మెల్లగా పరిస్థితులు చక్కబడతాయి. వైద్యపరమైన ఖర్చులు పెరుగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కాలం కలిసి రావడం లేదు కాబట్టి ఎవరితోనూ వివాదాలకు, ఘర్షణలకు దిగవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో స్తబ్దత నెలకొంటుంది. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వ్యాపారులు దూరప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఒక దుర్వార్త విచారం కలిగిస్తుంది. వృథా ఖర్చులు నివారించండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అన్నివిధాలా సహకరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సోదరుల నుంచి ఆర్ధిక లబ్ధి పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. నిరాశ చెందవద్దు. ప్రతికూల ఆలోచనలు విడిచి పెడితే మంచిది. యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంతత పొందవచ్చు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు శుభకాలం. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. ఇబ్బందికర పరిస్థితుల్లో పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే స్వభావంతో ఉండడం మంచిది. క్రమంగా పరిస్థితులు సర్దుకుంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మితిమీరిన కోపం, పరుష పదాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మౌనంగా ఉండడం మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్నింటా సమన్వయం పాటించండి. ఎవరితోనూ ఘర్షణ పడకండి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. అవసరానికి ధనసహాయం అందుతుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ఎలాంటి అవరోధాలనైనా అధిగమించ గలుగుతారు. సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనేక సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు. ఆర్థిక వ్యహారాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో అపార్ధాలు రాకుండా జాగ్రత్త వహించండి. కుటుంబంలో ఘర్షణ పూర్తిగా వాతావరణం ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. గృహ నిర్మాణంలో ముందంజ వేస్తారు. వృత్తి పరమైన ఇబ్బందులు, ఒత్తిడిని సమర్ధవంతంగా అధిగమిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేస్తారు. ఆర్థికాభివృద్ధికి సంబంధిన శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కర్తవ్య నిర్వహణలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసేందుకు చాలా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా పొదుపు పాటించడం అవసరం. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.