Horoscope | గురువారం రాశి ఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో విబేధాలు..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | గురువారం రాశి ఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో విబేధాలు..!

మేషరాశి

మేష రాశివారికి ఇవాళ ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ఆలోచ‌న‌ల‌ను మీ భాగ‌స్వామితో పంచుకోవ‌డానికి ఇవాళ అనుకూల స‌మ‌యం. ఆర్థికంగా శుభ‌ప్ర‌ద‌మైన రోజు. ఊహించ‌ని విధంగా డ‌బ్బు చేతికి అందుతుంది. పెద్ద ప్రాజెక్టుల‌ను ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

వృష‌భం

వృష‌భ రాశివారికి ఆర్థిక ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. కుటుంబ స‌భ్యుల‌తో మ‌రి ముఖ్యంగా మీ భాగ‌స్వామితో విబేధాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి విబేధాల‌కు దారి తీయ‌కుండా రాజీ ప‌డాల్సి వ‌స్తుంది. నిరాశ‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంది.

మిథునం

మిథున రాశివారికి అనుకూల వాతావ‌ర‌ణం ఉంది. వ్యాపారం లేదా ఇత‌ర కార్య‌క‌లాపాల‌లో పెట్టుబ‌డుల‌కు అనువైన స‌మ‌యం. వృత్తిప‌రంగా కూడా ఎదుగుతారు. వాద‌న‌ల జోలికి పోవ‌ద్దు. పోయినా కూడా ఎదుటి వారి అభిప్రాయాల‌ను గౌర‌వించాలి. కుటుంబంలో అశాంతి ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

క‌ర్కాట‌కం :

క‌ర్కాట‌క రాశివారు శాంతి, సామ‌ర‌స్యంతో మెల‌గాలి. క్షమించే స్వ‌భావం ఉండాలి. ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో తోటి ఉద్యోగుల‌తో మంచి సంబంధాలు ఏర్ప‌ర్చుకోవాలి. అప్పులు చేసే అవ‌కాశం ఉంది. వృత్తిప‌రంగా ఎదిగే అవ‌కాశం ఉంది.

సింహం

సింహ రాశివారికి ఇవాళ ప‌ట్టింద‌ల్లా బంగారమే. స‌మ‌యానికి డ‌బ్బు చేతికి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా గ‌డుపుతారు. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డ‌డంతో మ‌రిన్ని ప్రాజెక్టుల వైపు మొగ్గుచూపుతారు. ప్రియ‌మైన వారి ప‌ట్ల సానుకూలంగా ఉంటారు.

క‌న్య

క‌న్య రాశివారు ఇవాళ విలాసాల‌కు అధిక స‌మ‌యం కేటాయిస్తారు. ప్రియ‌మైన వారితో అధిక స‌మ‌యం గ‌డుపుతారు. ఆర్థిక ప‌రంగా కూడా లాభాలు పొందే అవ‌కాశం ఉంది. సంఘ‌ర్ష‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డుతారు. జీవిత భాగ‌స్వామి మాట‌కు విలువ ఇచ్చి.. వారిలో విశ్వాసాన్ని నింపుతారు.

తుల‌

తుల రాశివారికి గ‌తంలో పెట్టిన పెట్టుబ‌డుల ఫ‌లిస్తాయి. ఆర్థికంగా శుభ‌దినం. అనేక మార్గాల్లో డ‌బ్బు చేతికి వ‌స్తుంది. ఇష్ట‌మైన వారితో ఉత్సాహంగా గ‌డుపుతారు. చిన్న‌నాటి స్నేహితుల‌ను క‌లుసుకుంటారు. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు స్మార్ట్ ఫోన్స్, గాడ్జెట్‌ల‌ను కొనే అవ‌కాశం ఉంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. కోపం అదుపులో ఉంచుకోవాలి. భాగ‌స్వామితో విబేధాల‌కు ఆస్కారం ఉంది. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వ్యాపారం విష‌యంలో ప్ర‌తిఫ‌లాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టుల‌పై దృష్టి సారిస్తారు.

ధ‌నుస్సు

ధ‌నుస్సు రాశి వారి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ స‌భ్యులంతా క‌లుసుకుంటారు. ప్రియ‌మైన వారితో మ‌ధుర‌మైన స‌మ‌యాన్ని గ‌డుపుతారు. విలువైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. ఆర్థిక విష‌యాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాలి. వినోదానికి ఖ‌ర్చు చేస్తారు.

మ‌క‌రం

మ‌క‌ర రాశివారు ఇవాళ ఆధ్యాత్మిక భావ‌న‌లో మునిగిపోతారు. డ‌బ్బు కూడా బాగానే ఖ‌ర్చు పెట్టే అవ‌కాశం ఉంది. భావోద్వేగాల‌ను అదుపులో ఉంచుకోవాలి. ప్రియురాలికి అధిక స‌మ‌యాన్ని కేటాయిస్తారు. కొన్ని ప‌నుల‌ను మీరు వ‌దులుకొని.. రాబ‌డి వ‌చ్చే మార్గాల‌పై దృష్టి సారిస్తారు.

కుంభం

కుంభ రాశివారికి ఇంట్లో ప్ర‌తికూల ప‌రిస్థితులు ప‌రిస్థితులు ఉన్నాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంది. జీవిత భాగ‌స్వామితో రాజీ ప‌డాల్సి వ‌స్తుంది. వృధా ఖ‌ర్చులు నివారిస్తే బెట‌ర్. మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ధ్యానం చేయండి.

మీనం

మీన రాశి వారు త‌మ ప్రేమికుల‌తో ఇష్టంగా గ‌డుపుతారు. ల‌వ్ ప్ర‌పోజ్ చేసే అవ‌కాశం ఉంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు రావొచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. ఉన్న‌తాధికారుల‌తో ఉన్న సంబంధాల వ‌ల్ల వృత్తిప‌రంగా మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది.