గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేస్తే మంచిది..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేస్తే మంచిది..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఈ రోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి, వ్యాపారంలో నష్టాలకు గురికాకుండా జాగ్రత్త వహించండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. సహోద్యోగులతో సంబంధాలు మెరుగు పడతాయి. మీ ప్రతిభకు ప్రశంసలు పొందుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆర్థికంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. తీర్ధయాత్రలతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ముందస్తు ప్రణాళికతో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. కీలక అంశాలలో పెద్దలను సంప్రదించడం మంచిది. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ రోజు మంచిరోజు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగాలలో పనిభారం, శ్రమ పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారులకు రుణభారం తగ్గుతుంది. ఆశించిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలను సమర్ధవంతంగా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. అనవసర చర్చలకు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారులు కొత్త మెళకువలు అవలంబిస్తే లాభాలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం లోపిస్తుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడులు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో శుభయోగముంది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.