ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారులు ఈ రోజు చేసుకునే నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి పరంగా చేసే ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో వృత్తిలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. బంధువుల నుంచి విచారకరమైన వార్త వింటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిపట్ల నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్త పడండి. వ్యాపారులు దృఢమైన సంకల్పంతో ఆశించిన లాభాలు అందుకుంటారు. కుటుంబంలో వివాదాలు ఏర్పడకుండా మాటను అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో ఆశించిన ఫలితాలు రాబట్టుతారు. పెద్దలతో మాట్లాడేటప్పుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశముంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. పట్టినపట్టు విడవకుండా పనిచేసి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ కలహాల విషయంలో వీలైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది. ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో అనుకోని ఆటంకాలు ఆందోళన కలిగిస్తాయి. ఆర్థికంగా శ్రమకు తగిన ఆదాయం ఉండకపోవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు వాయిదా వేయండి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అవసరానికి సహాయం అందుతుంది. ధనధాన్య లాభాలున్నాయి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. ఉంటారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో ఆచి తూచి నడుచుకోండి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు విస్మరించవద్దు. ఉద్యోగంలో గతంలో చేసిన పొరపాట్లు దిద్దుకునే ప్రయత్నం ఫలిస్తుంది.