Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జలగండం.. జర జాగ్రత్త..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వేసే ప్రతి అడుగు విజయం వైపుగా ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఆర్థిక సంబంధమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన సమావేశాలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. దృఢ సంకల్పంతో, ముక్కుసూటి మనస్తత్వంతో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సమస్యలు విచారం కలిగిస్తాయి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో సందిగ్ధత నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సోదర వర్గంతో అనుబంధం దృఢ పడుతుంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలపై దృష్టి సారిస్తే మంచిది. ఉద్యోగంలో పనిభారం అధికంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు ఫలితాలు ఆలస్యం కావచ్చు. నిరాశ చెందవద్దు. ప్రతికూల ఆలోచనలు విడిచి పెట్టండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. డబ్బును మితంగా ఖర్చు చేయండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు సాఫీగా సాగిపోతుంది. వృత్తి పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సరదాగా, సంతోషంగా గడుపుతారు. లక్ష్మీకటాక్షం ఉంటుంది. సన్నిహితుల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ కోపం, పరుష మాటలతో ఇతరులను నొప్పిస్తారు. సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగ వ్యాపారాలలోనూ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎవరితోనూ ఘర్షణ పడకండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. మీ పనితీరును ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా గొప్ప శుభ సమయం.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశివారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగులకు, వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగవుతుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ మనసుకు నచ్చిన వారిని కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభ వార్తలు వింటారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో విఫలం అవుతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. జలగండం ఉంది కాబట్టి వీలైనంత వరకు జలాశయాలకు దూరంగా ఉండండి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహ గతులు అనుకూలంగా ఉండడంతో ఈ రాశి వారికి అన్నివిధాలా కలిసి వస్తుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి లాభాలు గడిస్తారు. కుటుంబంతో అనుబంధం దృఢ పడుతుంది. వృత్తి పరంగా మీరు సాధించిన విజయం మీకు గుర్తింపు తెస్తుంది.