Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని ధనలాభం..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
 
                                    
            మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఊహించని అనేక శుభ సంఘటనలు ఈ రోజు జరుగుతాయి. అదృష్టం వరించి ఐశ్వర్యవంతులవుతారు. కుటుంబ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. అనారోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా దూర ప్రదేశాలకు, ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులు దూరప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయండి. అపరిచితులకు దూరంగా వుండండి. సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ధనలాభాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టడానికి, వాహనాల కొనుగోలుకు ఈ రోజు చాలా మంచి రోజు. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో విహార యాత్రకి వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. జీవిత భాగస్వామి, సహచరుల సహకారం లోపించడంతో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అంచనాలకు మించిన లాభాలను అందిస్తాయి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. సన్నిహితుల సహకారంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఖర్చులు పెరుగుతాయి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. కుటుంబ సభ్యులతో కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా వుండండి. ఆస్తి వ్యవహారాలతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అదృష్ట ఫలితాలు ఉంటాయి. ఈ రోజు జరిగే అన్ని సంఘటనలు మీ మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే! సన్నిహితులతో ఈ రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఆర్ధికంగా విశేషమైన లాభాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలం.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి, శ్రమ పెరగవచ్చు. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా జాగ్రత్త పడండి. కుటుంబ కలహాలు ఏర్పడకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్ధిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు పూర్తి ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి, పదోన్నతులు ఉంటాయి. ఉద్యోగంలో కావలసినంత ఆదాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు లాభాదాయకంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ముందుచూపుతో వ్యవహరించి ఆర్ధికంగా విశేష లాభాలు అందుకుంటారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఆనందం కలిగిస్తుంది. పెద్దల సలహాలు ఉపయోగకరంగా వుంటాయి. కొత్త స్నేహాలు, సంబంధాలు దీర్ఘ కాలం పాటు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి.
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram