Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

మేషం (Aries)

ఈ రాశివారికి అన్ని ప‌నులు స‌కాలంలో విజ‌య‌వంతంగా పూర్త‌వుతాయి. ఊహించ‌ని ధ‌న‌లాభాలు ఉంటాయి. అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తారు. ఇష్ట‌మైన వారితో మంచి స‌మ‌యాన్ని గ‌డుపుతారు. ఆరోగ్యం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంది. కుటుంబ స‌భ్యుల్లో ఆనందం నెల‌కొంటుంది.

వృషభం (Taurus)

ఈ రాశివారికి ఇవాళ అనుకూల స‌మ‌యం న‌డుస్తోంది. పెండింగ్ ప‌నులు పూర్తి చేయ‌డంతో పాటు కొత్త పనులు ప్రారంభిస్తారు. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఊహించ‌ని ధ‌న‌లాభం ఉంటుంది. ఉన్న‌తాధికారుల మెప్పు పొందుతారు. ఊహించ‌ని విధంగా ప‌దోన్న‌తులు పొందుతారు. ఆరోగ్యం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంది.

మిథునం (Gemini)

ఈ రాశివారికి కొంత ప్ర‌తికూల స‌మ‌యం న‌డుస్తోంది. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు క‌ల‌గ‌వ‌చ్చు. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మీ పరిధికి మించిన విషయాల్లో అనవసర జోక్యం తగదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం (Cancer)

క‌ర్కాట‌క రాశివారిని ఇవాళ దుర‌దృష్టం వెంటాడుతుంది. ప్రారంభించిన ప్ర‌తి ప‌నిలో ఆటంకాలు ఏర్ప‌డుతాయి. కొత్త ప‌నులు కొంత‌కాలం వాయిదా వేయ‌డం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ ముంద‌డుగు వేయాలి. ఆరోగ్యంపై పూర్తి శ్ర‌ద్ధ అవ‌స‌రం.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. కార్యసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సామాజికంగా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు.

కన్య (Virgo)

ఈ రాశివారికి అనుకున్నంత మంచిగా ఫ‌లితాలు లేవు. అయితే మిమ్మ‌ల్ని ప్ర‌భావితం చేసే వ్య‌క్తి మీకు తార‌స‌ప‌డ‌డంతో.. ఆ ప‌రిచ‌యం మీకు అదృష్టంగా మారుతుంది. క‌ఠినంగా శ్ర‌మిస్తేనే ఫ‌లితాలు ఆశించొచ్చు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఓ వార్త మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు తమ అధికారులు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. తోటి ఉద్యోగుల సహకారం లోపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ తెలివితేటలూ, నాయకత్వ లక్షణాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. చక్కని శుభకాలం నడుస్తోంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేష లాభాలుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందగు వేస్తారు. కుటుంబం కలహాలతో పరిస్థితి అదుపు తప్పవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కీలక వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అందరికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగ్రహం అనుకూలతతో అన్ని పనులు దిగ్విజయంగా ముగుస్తాయి. ఆర్థిక అభివృద్ధి ఉంది. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగానే గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయాలు అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు విశేష లాభాలు ఉంటాయి.