Horoscope | ఆదివారం రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కష్టించి పనిచేసినా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ప్రయాణాలు అనుకూలం కాదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లో సహనంతో వ్యవహరించాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కష్టించి పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులతో చికాకుతో ఉంటారు. ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. జీవిత భాగస్వామితో వాదనలు, వ్యాపార భాగస్వాములతో తగాదాలు ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో, కృత నిశ్చయంతో వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు సాధిస్తారు. సామాజికంగా మంచి గుర్తింపు పొందుతారు. పిత్రార్జితం వల్ల లాభపడవచ్చు. భూమి, ఆస్తి విషయాలు అనుకూలం.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అదనపు ధనాన్ని లేక ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి సమయం. అదృష్ట సమయం నడుస్తోంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలం కాదు. పనిపట్ల ఏకాగ్రత లోపించడంతో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఫలించవు. వ్యాపారంలో నష్టాలు సంభవించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ప్రయాణాలు అనుకూలించవు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు తమ తమ రంగాల్లో విశేషమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు. అన్ని రంగాలవారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ప్రమోషన్ అవకాశం ఉంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ధనలాభాలున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్యసాధన కోసం శ్రమిస్తారు. ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.