Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభాలున్నాయి..!
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు సమర్థవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో శుభ యోగాలున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శుభవార్తలు వింటారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలించడం లేదు కాబట్టి ముఖ్యమైన పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆర్థిక విషయాల్లో అదనపు శ్రద్ధ అవసరం. సన్నిహితుల సలహాలు మేలు చేస్తాయి. శత్రుభయం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోని ధనలాభాలున్నాయి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. కొన్ని సంఘటనలు మీకు సంతృప్తి కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ఈ ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభాలు ఉంటాయి. పదోన్నతులు ఉండవచ్చు. వృత్తి రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. కుటుంబంతో తీర్ధయాత్రలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఆనందం కలిగిస్తాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. వృత్తిలో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయండి. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు గమనించుకుంటూ ఖర్చు చేస్తే మంచిది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుచూపుతో వ్యవహరించడం వల్ల ఉద్యోగ వ్యాపారాలలో నష్టభయం తగ్గుతుంది. కీలక విషయాల్లో పెద్దలను సంప్రదించడం మంచిది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు అధికం కాకుండా జాగ్రత్త తీసుకోండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు గొప్ప శుభఫలితాలు ఉంటాయి. కుటుంబంతో ఆనందప్రదమైన సమయాన్ని గడుపుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఆర్థిక లాభాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోరాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. ఖర్చులు తగ్గించుకోండి.