Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశముంది. ఈ రోజు ముఖ్యమైన పనులు చేపట్టవద్దు. కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయండి. వ్యాపారాలు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ఆర్థిక విషయాలు అంత అనుకూలంగా లేవు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా లేదు కాబట్టి ప్రారంభించిన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ మాటకు, నిర్ణయాలకు విలువ ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఏ మాత్రం పొరబాటు చేయకూడదు. ముఖ్యమైన దరఖాస్తులపై సంతకాలు గానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ చేయకండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. నూతన వస్త్రాభరణాలు కొంటారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరుల విషయంలో అనవసర జోక్యం తగ్గించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా ఈ రోజు కలిసి వస్తుంది. ఆత్మీయుల సహకారం ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. సంపద శక్తి ఏమిటో మీరు ఈ రోజు తెలుసుకుంటారు. విలువైన సమయాన్ని వృథా చెయ్యకండి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి ద్వారా, ఆదాయం వృద్ది ద్వారా కలిసి వస్తుంది. అన్ని విషయాల్లో తారాబలం చాలా అనుకూలంగా ఉంది. పితృ వర్గం నుంచి ఆర్థిక లబ్ధి పొందవచ్చు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఆదాయం పెరగడం ఆనందం కలిగిస్తుంది. ఈ రోజు ఏదైనా కొత్త పనిని ఆరంభించండి. భవిష్యత్ ప్రణాళికను అమలు చేయండి. వృత్తిపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ పెద్దలతో, ఉన్నతాధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. స్నేహితులతో విహార యాత్రకు వెళ్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. కుటుంబంలో ఆనందం నేలలోంతుంది. వృత్తిపరమైన జీవితంలో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి పరంగా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో నష్టం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.