Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణ యోగం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన కీలక చర్చలు ఫలవంతంగా ఉంటాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన కుటుంబ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తారాబలం అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలు లాభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొన్ని అనుకోని ఘటనలు జరుగుతాయి. మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ప్రమాదాలకు, అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. బంధు మిత్రులతో కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయంగా ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆశించిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. వ్యాపారులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శ్రమ, పని ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సమస్యలు రాకుండా కోపం అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. వృధా ఖర్చులు నివారించండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగవచ్చు. మానసిక ఒత్తిడి పెరగకుండా జాగ్రత వహించండి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ఈ రోజు మంగళకరమైన రోజు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కీలక నిర్ణయాల విషయంలో అనిశ్చితి నెలకొంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఊహించని విధంగా వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు సరైన ప్రణాళికతో మంచి లాభాలు గడిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైన సమావేశాల్లో చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికపరమైన లాభాలున్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు కల్యాణయోగం ఉంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఒక ఘటన విచారం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నడుచుకోండి.