Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో గ‌డిపే స‌మ‌యం అద్భుతం..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో గ‌డిపే స‌మ‌యం అద్భుతం..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామితో గడిపే సమయం అద్భుతమైనదిగా ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వబుద్ధితో నడుచుకుంటే చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనోబలాన్ని కోల్పోకండి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. శత్రువుల వ్యవహారాలు ఓ కంట కనిపెట్టి ఉంచండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తిపరమైన ఆందోళనలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమించాలి. కొత్త పనులు ఆరంభించకండి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయవద్దు. వివాదాలు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ఉద్యోగంలో పురోగతి లోపించడం అసంతృప్తి కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ, గృహ, ధన లాభాలున్నాయి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు, స్థిరాస్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపావేశాలు తగ్గించుకోవడం అవసరం. చెడు పనులు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి శుభ సమయం నడుస్తోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఫురోగతి నిరాశపరుస్తుంది. వ్యాపారంలో ధననష్టం ఉండవచ్చు. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి ప్రమాదకరమైన వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ బుద్ధిబలంతో మంచి లాభాలు పొందుతారు. వివిధ మార్గాల నుంచి పెట్టుబడులు రాబట్టుతారు. వృత్తి పరంగా చాలా ధనం సంపాదిస్తారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గ్రహ సంచారం సామాన్యంగా ఉన్నందున అన్ని రంగాల వారికి వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన పనులు చేపట్టకూడదు.