Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆర్థికంగా అనుకూల ఫ‌లితాలు..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • By: raj |    devotional |    Published on : Aug 03, 2025 7:29 AM IST
Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆర్థికంగా అనుకూల ఫ‌లితాలు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ధనలాభం ఉంది. మీ ప్రతిభకు పురస్కారం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. విశేషమైన శుభ సమయం నడుస్తోంది. అన్ని విధాలా అనుకూలత ఉంటుంది. నూతన గృహ వాహనాది యోగాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధిస్తారు. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో వినయంగా వ్యవహరించాలి. దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శుభ వర్తమానం అందుకుంటారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలున్నా అధిగమిస్తారు. వ్యాపారులకు గత పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా లేదు. ఊహించని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వామ్య ప్రాజెక్టులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పురోగతి లోపించడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. ఖర్చుల పట్ల అవగాహనతో మెలగండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పని చేస్తాయి. జీవిత భాగస్వామితో తీర్ధ యాత్రలకు వెళ్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు సీకరిస్తారు. శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభ ప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వ్యక్తిగతంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సునాయాసంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అదృష్టకరంగా ఉంటాయి. ఊహించని విజయం సాధిస్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు శుభ ప్రదంగా ఉంటుంది. లక్ష్మీకటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారులకు బ్రహ్మాండమైన యోగం ఉంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.