Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు క‌ళ్యాణ‌యోగం..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు క‌ళ్యాణ‌యోగం..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవడం ఆనందం కలిగిస్తుంది. ఆదాయంలో పెరుగుదల సంతృప్తినిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ధనధాన్య లాభాలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులు నూతన అవకాశాలు, పదోన్నతులు అందుకుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నం ఫలప్రదమవుతుంది. పనిప్రదేశంలో మర్యాద, గౌరవం పెరుగుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ ఘర్షణలకు పోకుండా రాజీ ధోరణి అవలంబిస్తే మంచిది. కోపావేశాలు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు. వృత్తిపరంగా కొన్ని వివాదాలు చోటు చేసుకునే అవకాశముంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సమస్యలుండవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రియమైన వారితోనూ, అపార్థాలూ రాకుండా జాగ్రత్త వహించండి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులతో హోదా పెరుగుతుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. సంపాదన పెరగడం ఆనందం కలిగిస్తుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలు కుటుంబ సభ్యుల సహకారంతో తొలగిపోతాయి. ఎవరితోనూ గొడవలు, వాదనలు లేకుండా మాట అదుపులో ఉంచుకోవాలి. ఊహించని ప్రమాదం సంభవించవచ్చు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభతో, నైపుణ్యంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఏ రంగంలో అడుగుపెట్టినా, పట్టింది బంగారం అవుతుంది. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజంతా ఆనందదాయకంగా గడిచిపోతుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభం, కుటుంబ సంతోషం ఉంటాయి. మీ లక్ష్యాలు సునాయాసంగా నెరవేరుతాయి. ఉద్యోగులు తమ పై అధికారుల మద్దతుతో ప్రమోషన్ పొందవచ్చు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలించడం లేదు కాబట్టి ప్రతి పనిలోనూ ఆచి తూచి నడుచుకోవాలి. ఉద్యోగులు కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు పెంచుకోడానికి ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి.