Own House | సొంతింటి క‌ల నెర‌వేర‌డం లేదా..? అయితే శివుడిని, వ‌రాహ‌స్వామిని పూజించండి..!

Own House | సొంతిల్లు ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందుకోసం చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ క‌లిసిరాదు. బోలెడ‌న్ని డ‌బ్బులు ఉన్నా కూడా ర‌క‌ర‌కాల అడ్డంకులు వ‌స్తుంటాయి. ఈ ఆటంకాలు తొల‌గిపోయి, సొంతిల్లు కొనాలంటే.. శివుడిని, గోమాత‌ను, వరాహ‌స్వామిని పూజించాల‌ని జ్యోతిష్య‌, వాస్తు పండితులు సూచిస్తున్నారు.

సొంత ఇల్లు ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఈశ్వ‌రుడి ఆజ్ఞ ఉండాల్సిందే. కాబ‌ట్టి ప్ర‌తి సోమ‌వారం ఆ ఇంటి ఇల్లాలు మ‌హా శివుడికి పూజ‌లు చేయాలి. శివుడిని పూజించిన రోజున జాజి పూల మాల స‌మ‌ర్పిస్తే సొంతింటి క‌ల త‌ప్ప‌కుండా నెర‌వేరుతుంద‌ని పండితులు సూచిస్తున్నారు.

ఇక గోమాత‌ను కూడా ప్ర‌తి శుక్ర‌వారం పూజించాలి. గోమాత చుట్టూ ఏడు సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి. ప్ర‌ద‌క్షిణ‌లు పూర్త‌యిన త‌ర్వాత‌.. గోవు వెనుక భాగంలో పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టాలి. అక్షింత‌లు వేసి పూజించాలి. అనంతరం ఓం సురభ్యై నమః అని 11 సార్లు జపించాలి. ఎవరైతే ఇలా భక్తిశ్రద్దలతో గోమాతను పూజిస్తారో ఆ గోమాత అనుగ్రహం వలన అతి త్వరలోనే వారికి నూతన గృహ ప్రాప్తి సిద్ధిస్తుంది.

మన పురాణాల ప్రకారం ఎవరికైనా భూమి కానీ, ఇల్లు కానీ సమకూరాలంటే భూ వరాహస్వామి అనుగ్రహం ఉండి తీరాల్సిందే. సాక్షాత్తు ఈ భూమండలాన్ని సముద్రం నుంచి పైకి తీసిన ఆ భూ వరాహస్వామి ప్రార్ధిస్తే ఎవరికైనా భూలాభం, గృహ ప్రాప్తి కలిగి తీరుతుంది. భక్తిశ్రద్ధలతో భూ వరాహస్వామి ఆలయానికి వెళ్లి మనస్ఫూర్తిగా సొంత ఇల్లు కావాలని కోరుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది.