Kartika Pournami | నేడే కార్తీక పౌర్ణ‌మి.. చేయాల్సిన, చేయ‌కూడ‌ని ప‌నులు ఇవే..!

 Kartika Pournami | కార్తీక పౌర్ణ‌మి(  Kartika Pournami ) రోజున హిందువులంద‌రూ( Hindus ) ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో శివాల‌యాల‌ను( Shiva Temples ) సంద‌ర్శిస్తారు. దీపారాధాన చేసి త‌మ మొక్కుల‌ను చెల్లించుకుంటారు. అయితే కార్తీక పౌర్ణ‌మి రోజున చేయాల్సిన ప‌నులు, చేయ‌కూడని ప‌నులు ఏవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

  • By: raj |    devotional |    Published on : Nov 05, 2025 7:26 AM IST
Kartika Pournami | నేడే కార్తీక పౌర్ణ‌మి.. చేయాల్సిన, చేయ‌కూడ‌ని ప‌నులు ఇవే..!

Kartika Pournami | అత్యంత పవిత్ర‌మైన కార్తీక పౌర్ణ‌మి( Kartika Pournami ) రోజున‌.. శుభాలు క‌లిగించే ప‌నులు చేయాల‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకానీ అవ‌రోధాలు క‌లిగించే ప‌నులు చేయ‌డం మూలంగా జీవితాంతం న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ఇవాళ కార్తీక పౌర్ణ‌మి. కాబ‌ట్టి చేయాల్సిన ప‌నులు, చేయ‌కూడని ప‌నులు ఏవో ఈ క‌థ‌నం తెలుసుకుందాం..

కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన ప‌నులు..

  • కార్తీక పౌర్ణ‌మి రోజున న‌దీ స్నాయం చేయ‌డం మంచిది.
  • శివారాధ‌న చేయ‌డం శుభ ఫ‌లితాల‌ను ఇస్తుంది.
  • వీలైతే ఆల‌యాల్లో, ఇంట్లో రుద్రాభిషేకం చేయ‌డం శుభ‌ప్ర‌దం.
  • సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత శివాల‌యంలో లేదా రావిచెట్టు, తుల‌సి మొక్క వ‌ద్ద దీపాలు వెలిగిస్తే మంచిది.
  • ఉసిరికాయ‌లు దానం చేస్తే దారిద్య్రం తొల‌గిపోతుంది.
  • నిరుపేద‌ల‌కు అన్న‌దానం చేయాలి. వ‌స్త్ర‌దానం చేయ‌డం, రోగుల‌కు పండ్లు దానం చేస్తే పాపాలు తొల‌గిపోతాయి.
  • మ‌రి ముఖ్యంగా పెళ్లికానివారు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి-తులసి మొక్కను ఒకేదగ్గర చేర్చి ఆ పక్కనే రాధాకృష్ణుల విగ్రహం పెట్టి పూజచేస్తే ఉత్తమ జీవిత భాగస్వామి లభిస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజున చేయ‌కూడ‌ని ప‌నులు ఇవే..

  • కార్తీక పౌర్ణమి రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం ఇవ్వకూడదు.
  • పున్నమి వెలుగుల వేళ ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదు.. ఇల్లంతా కూడా పండు వెన్నెలలా ఉండాలి.
  • కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి…సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
  • ఇంటికి వచ్చిన బిచ్చగాడికి ఆహారం పెట్టండి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి.
  • ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే ఇంకా శుభఫలితాలు పొందుతారు.