Sunday | ఆదివారం ఈ ఐదు నియ‌మాలు పాటిస్తే.. ఆరోగ్య, ఐశ్వర్యాలు మీ సొంతం..!

Sunday | ఆదివారం( Sunday ) అంటేనే ఆట‌విడుపుగా భావిస్తాం.. ఈ నేప‌థ్యంలో అంద‌రూ నిర్ల‌క్ష్యం చేస్తారు. కానీ ఆ నిర్ల‌క్ష్యం మొద‌టికే మోసం తెస్తుంద‌ట‌. కాబ‌ట్టి ఆదివారం సూర్యోద‌యం( Sunrise ) కంటే ముందే నిద్ర( Sleep ) మేల్కొని.. ఈ ఐదు నియ‌మాలు పాటిస్తే.. ఆరోగ్య‌( Health ), ఐశ్వ‌ర్యాలు మీ సొంత‌మ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Sunday | ఆదివారం ఈ ఐదు నియ‌మాలు పాటిస్తే.. ఆరోగ్య, ఐశ్వర్యాలు మీ సొంతం..!

Sunday | ఆదివారం సెల‌వు( Sunday Holiday ) ఉంటుంది.. కాబ‌ట్టి చాలా మంది రోజు మాదిరి కాకుండా.. ఆ రోజు కొంత నిర్ల‌క్ష్యం వ‌హిస్తారు. సెల‌వే కదా అని చెప్పి ఎనిమిదింటికో.. తొమ్మిందింటికో నిద్ర( Sleep ) మేల్కొంటారు. ఆట‌విడుపుగా భావించి అన్ని ప‌నుల్లోనూ నిర్ల‌క్ష్యంగా ఉంటారు. కానీ అలా చేయ‌డం మంచిది కాద‌ని జ్యోతిష్య పండితులు హెచ్చ‌రిస్తున్నారు.

ఆదివారం రోజు సూర్య( Sun ) భగవానుని పూజించడం అత్యంత ఫలప్రదం అని పండితులు సూచిస్తున్నారు. ఆదివారం ఆరోగ్య వరాలను అందించే వారంగా కూడా ఆదివారాన్ని శాస్త్రంలో వర్ణిస్తారు. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి ఆదివారం సూర్యోదయ సమయంలో ఇచ్చే అర్ఘ్యం ఆరోగ్యం, సుఖసంపదలు ఇస్తుందని విశ్వాసం. కాబ‌ట్టి ఆదివారం రోజున సూర్యోద‌యం కంటే ముందే నిద్ర మేల్కొని కొన్ని నియ‌మాలు పాటించ‌డంతో పాటు సూర్య ఆరాధన చేస్తే అనంత కోటి ఫ‌లితాలు మ‌న చెంత‌కు చేరుతాయ‌ని చెబుతున్నారు పండితులు.

ఆదివారం పాటించాల్సిన నియ‌మాలు ఇవే..

  • ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి.
  • ఆదివారం సూర్యోదయం తరువాత పళ్లు తోమితే సూర్యునికి ఆగ్రహం వచ్చి అనారోగ్యం కలిగిస్తాడంట!
  • ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.
  • ఆదివారం రోజు ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
  • ఆదివారం విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.
  • ఆదివారం ఈ అయిదు నియమాలు పాటిస్తే సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్ర వచనం.