ఇంట్లో ఏడు గుర్రాల ఫొటో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?

దేవుళ్ల ఫొటోల‌తో పాటు ఏడు గుర్రాల ఫొటో ఉంటే కూడా ఎన్నో లాభాలు జ‌రుగుతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పెయింటింగ్ ఫొటోల‌తో ఇంటికి కూడా అందం వ‌స్తుంది.

ఇంట్లో ఏడు గుర్రాల ఫొటో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?

హిందూ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారు త‌మ ఇంట్లో అన్ని ర‌కాల దేవుళ్ల ఫొటోల‌ను పెట్టుకుంటారు. అంతేకాకుండా ప్ర‌త్యేకంగా ఓ పూజ గ‌దిని ఏర్పాటు చేసుకుంటారు. ఇక ప్ర‌తి రోజు పూజా కార్య‌క్ర‌మాలు చేసి, కోరిక‌లు కోరుతారు. మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే దేవుళ్ల ఫొటోల‌తో పాటు ఏడు గుర్రాల ఫొటో ఉంటే కూడా ఎన్నో లాభాలు జ‌రుగుతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పెయింటింగ్ ఫొటోల‌తో ఇంటికి కూడా అందం వ‌స్తుంది. ఏడు గుర్రాల చిత్ర‌ప‌టంతో పాటు జ‌ల‌పాతం, రాధాకృష్ణ పెయింటింగ్ కూడా ఇంటికి మంచిద‌ని చెబుతున్నారు.

ప‌రుగెడుతున్న ఏడు గుర్రాల ఫొటో..

వాస్తు శాస్త్రం ప్ర‌కారం.. ప్ర‌తి ఇంట్లో ప‌రుగెడుతున్న ఏడు గుర్రాల ఫొటో ఉండాల‌ట‌. ఈ చిత్రం ఉండ‌టం వ‌ల్ల అన్ని శుభాలే క‌లుగుతాయ‌ట‌. ఆర్థికంగా చితికిపోకుండా ఉండొచ్చ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఏడు గుర్రాల ఫొటో మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి అనే సందేహం మీకు రావొచ్చు. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం.. 7 అంకెను శుభప్రదంగా పరిగణిస్తారు. 7 అంకెతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుందట. అది ఎలా అంటే.. దంపతులు పెళ్లిలో ఏడు అడుగులు వేస్తారు. అలాగే భూమిపై ఏడు మహాసముద్రాలు ఉన్నాయి. ఖండాలు కూడా ఏడే ఉన్నాయి. ఇంకా సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయి. ఇలా.. ఏడు అంకె ఎంతో విలువైనదని.. అందుకే ప‌రుగెడుతున్న ఏడు గుర్రాల ఫొటోను హాల్‌లో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

రాధాకృష్ణ పెయింటింగ్..

వాస్తు ప్రకారం ఇంట్లో రాధాకృష్ణ పెయింటింగ్‌ ఉండటం వల్ల శాంతి, శ్రేయస్సు కలుగుతాయట. ఈ పెయింటింగ్స్​ ఇంట్లో ఏ గదిలోనైనా పెట్టుకోవచ్చని చెబుతున్నారు. అయితే.. అది ఉత్తర గోడకు ఉండటం ఇంకా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనిని బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందని చెబుతున్నారు.

జలపాతం పెయింటింగ్

ఇంట్లో అందమైన జలపాతం పెయింటిగ్‌ను పెట్టుకోవడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందట. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, కలహాలు అన్నీ తొలగిపోయి శాంతి కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ఈ పెయింటింగ్‌ ఉండటం వల్ల సంపద కూడా పెరుగుతుందట. అందుకే దీనిని హాల్‌లో ఉత్తర గోడపై వేలాడదీయాలని సూచిస్తున్నారు.