Jaganmohini Keshava Swamy Temple | కోరుకున్న చోటికి బదిలీ కావాలంటే.. ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే..!
Jaganmohini Keshava Swamy Temple | మీకు కోరుకున్న చోటికి బదిలీ( Transfer ) కావడం లేదా..? ఉద్యోగం( Job )లో ప్రమోషన్లు( Promotion ) లేవా..? అయితే ఆలస్యం ఎందుకు.. బదిలీల ఆలయంగా( Transfer Temple ) ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి ఆలయాన్ని(Jaganmohini Keshava Swamy Temple ) సందర్శించండి మరి.

Jaganmohini Keshava Swamy Temple | ప్రభుత్వ ఉద్యోగులు( Govt Employees ) కానీ, ప్రయివేటు ఉద్యోగులు( Private Employees ) కానీ ఒకే చోట ఎక్కువ కాలం పని చేయడానికి ఇష్టపడరు. మరో చోటికి బదిలీ( Transfer ) కావాలని కోరుకుంటారు. కానీ అనేక రకాల సమస్యల వల్ల బదిలీలు సాధ్యం కాకపోవచ్చు. బదిలీల కోసం ఉన్నతాధికారులను సంప్రదించినా కూడా ఫలితం ఉండదు. కానీ బదిలీల ఆలయంగా( Transfer Temple ) ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని సందర్శించి, మొక్కులు చెల్లించుకుంటే తప్పనిసరిగా కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. అంతేకాదు.. కోరుకున్న విధంగా పదోన్నతులు( Promotions ) కూడా లభించే అవకాశం ఉంది. మరి ఆ ఆలయం పేరేంటి..? అది ఎక్కడుందో వివరాలు తెలుసుకుందాం.
కోరుకున్న చోటికి బదిలీ( Transfer ), ప్రమోషన్( Promotion ) పొందాలంటే.. ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh )లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం( Ravulapalem ) మండలం ర్యాలీ వెళ్లాల్సిందే. ఇక్కడ ముందు భాగంలో కేశవ స్వామి (విష్ణుమూర్తి) రూపంలో వెనుక వైపు జగన్మోహిని రూపంలో దర్శనమిచ్చే అరుదైన ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయానికి ప్రతి రోజు ఉద్యోగులు( Employees ) భారీగా తరలివస్తుంటారు. తమకు ఇష్టమైన ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా బదిలీ చేయాలని ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంటారు. దాంతో పాటు ప్రమోషన్‌కు కూడా ఈ ఆలయానికి వచ్చి ప్రార్థిస్తుంటారు. చాలా మంది ఇక్కడికి వచ్చిన తరువాత తాము కోరుకున్న చోటికి ట్రాన్స్‌ఫర్ అయ్యిందని మొక్కులు తీర్చుకుంటుంటారు.. అందుకే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలు అయ్యిందంటే చాలు ఈ ఆలయానికి ఉద్యోగులు కుటుంబ సమేతంగా తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఆలయం బదిలీలు, ప్రమోషన్ల మొక్కులు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
అత్యంత ప్రసిద్ధమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయం రావులపాలెం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు.