IRCTC Sapta Jyotirlinga Tour | జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటున్నారా..? భారత్ గౌరవ్ రైలులో సప్త జ్యోతిర్లింగ యాత్ర..!
IRCTC Sapta Jyotirlinga Tour | ప్రతీ హిందువు జీవితకాలంలో జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా పరమశివుడి భక్తులు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు.

IRCTC Sapta Jyotirlinga Tour | ప్రతీ హిందువు జీవితకాలంలో జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా పరమశివుడి భక్తులు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు. ఒకేసారి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు అవకాశం వస్తే.. ఎలా ఉంటుంది ? అ అనుభూతే వేరు ఉంటుంది కదూ..! అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ అలాంటి ప్యాకేజీని తీసుకువచ్చింది. ఒకేసారి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నది. సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్ర భారత్ గౌరవ్ రైలులో ఈ యాత్ర సాగనున్నది. ఈ యాత్రలో ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఒంకారేశ్వర్, నాగేశ్వర్, సోమ్‌నాథ్ టెంపుల్, పుణే భీమశంకర్, నాసిక్ త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్ గ్రిష్నేశ్వర్ ఆలయాలను దర్శించుకునే అవకాశం కలుగనున్నది. ఈ సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర 12 రోజులు.. 11 రాత్రుల పాటు సాగనున్నది. ఆగస్టు 17న మొదలవనున్నది. ప్రస్తుతం రైలులో 716 సీట్లు అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీ విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది. మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేట, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్, కామరెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముక్దేడ్, నాందేడ్, పూర్ణా గుండా సాగనున్నది. మూడోరోజు ఉజ్జయిని మహాకాళేశ్వర్, నాలుగో రోజు ఓంకారేశ్వర్, ఐదోరోజు ద్వారక, ఆ రోజు ఓఖా చేరుకొని ద్వారక.. నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటారు. ఏడోరోజు సోమ్‌నాథ్, ఎనిమిదో రోజు నాసిక్ త్రయంబకేశ్వర్, తొమ్మిదో రోజు నాసిక్‌లో నివాసం ఉండాల్సి వస్తుంది. పదో రోజు పుణే, పదకొండో రోజు ఔరంగాబాద్‌లో గ్రిష్ణేశ్వర్‌లో దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమవుతారు. 12వ రోజు ఉదయం 2.05 గంటలకు పూర్ణ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. ఎకానమీ కేటగిరిలో డబుల్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.రూ.20,590 ధర చెల్లించాల్సి వర్తిస్తుంది. పిల్లలు 5 నుంచి 11 సంత్సరాల మధ్య వయసు ఉన్న వారికి రూ.19,255 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరిలో డబుల్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.33,015 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ కేటగిరిలో డబుల్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.43,355 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజిలో మార్నింగ్ టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, డిన్నర్‌తో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ సైతం వర్తిస్తుంది.