Ugadi Rasi Phalau 2025 | సింహ రాశి వారికి ఏడాదంతా ప్రతికూలమే..! వివాహ ప్రయత్నాలకు అన్నీ ఆటంకాలే..!!
Ugadi Rasi Phalau 2025 | సింహరాశి( Leo ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును.

Ugadi Rasi Phalau 2025 | సింహరాశి( Leo ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును.
15 మే 2025 వరకు అతి చక్కటి అనుకూల ఆర్ధిక లాభములను పొందుతారు. ముఖ్యంగా న్యాయవాద వృత్తి జీవనం చేయువారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతర వృత్తి జీవనం వారు మిక్కిలి న్యాయవంతంగా ఆశించినంత ధనార్జన చేయగలుగుతారు. మీ చేతిపై విశేష సత్కార్యములు జరుగుతాయి. మంచి ఖ్యాతిని గడిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సంతాన ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి.
16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు వ్యాపార రంగంలోని వారికి విశేష అనుకూలత ఏర్పడుతుంది. నూతనంగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వారికి ఈ కాలం అతి చక్కటి కెరీర్‌ని ప్రసాదించును. అన్ని వృత్తుల వారికి ఆర్ధికంగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.
20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురు గ్రహం వలన అంత అనుకూల ఫలితాలు ఏర్పడవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం కంటే వ్యయం అధికం అవుతుంది.
6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న కాలం గురు గ్రహ బలం వలన చక్కగా లాభిస్తుంది. ఆర్ధికంగా అనుకూలత ఉంటుంది. రుణ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ జీవనంలో అభివృద్ధి పొందడానికి ఈ కాలం అనుకూలమైనది.
సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లోపించిన వారికి శని వలన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురగును. వివాహ ప్రయత్నాలు చేయు వారికి శని వలన అంత అనుకూలత ఉండదు. వివాహ ప్రయత్నాలకు అనేక ఆటంకాలను ఏర్పరచును. శత్రుత్వాలు అధికం అవుతాయి. అవసరమగు సందర్భంలో మీ వాక్చాతుర్యమును ఉపయోగించుకోలేరు. సింహ రాశి వారు ఈ సంవత్సరం అంతా వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన కూడా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఆరోగ్య విషయాలలో, కళత్ర సంబంధ విషయాలలో, తగాదాలకు సంబందించిన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. సింహ రాశి వారు ఈ సంవత్సరం ఇతరులకు పెద్ద మొత్తాలలో ఋణాలు ఇవ్వకుండా ఉండడం మంచిది.
సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలే ఎదురగును. ఈ సంవత్సరం కేతు గ్రహం వలన సింహరాశి కి చెందిన పిల్లలకు తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదురగు సూచన ఉన్నది. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగి ఉన్న వారు తరచుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకాలు జరిపించుకోనుట మంచిది. మొత్తం మీద సింహ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఒక్క గురు గ్రహం మాత్రమే అనుకూల ఫలితాలు కలుగచేయును