March Horoscope | మార్చి నెలలో ఈ మూడు రాశుల వారికి అన్నీ సమస్యలే..!
March Horoscope | చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. అయితే గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా రాశిఫలాలు మారుతుంటాయి. మారుతున్న రాశిఫలాలకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ సమయంలో ఏ పని చేస్తే బాగుంటుందో జ్యోతిష్యులు చెబుతుంటారు.
March Horoscope | చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. అయితే గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా రాశిఫలాలు మారుతుంటాయి. మారుతున్న రాశిఫలాలకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ సమయంలో ఏ పని చేస్తే బాగుంటుందో జ్యోతిష్యులు చెబుతుంటారు. అయితే మార్చి నెలలో ఈ మూడు రాశుల వారికి అన్నీ సమస్యలే ఉంటాయని, ఏ పని చేపట్టిన ఆటంకాలు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం..
మేష రాశి (Aries)
మేష రాశివారికి మార్చి నెల మొత్తం అనుకూలంగా లేదు. ఊహించని విధంగా ధన వ్యయం ఉంటుంది. కుటుంబంలో ఆస్తి వివాదాల కారణంగా విబేధాలు ఏర్పడుతాయి. ఈ రాశివారిలో కొందరు వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది. చెడు వార్తలు వింటారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనతో విసిగిపోయి బాధపడుతారు. ఈ రాశివారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొండి పట్టుదల వీడితే బెటర్ అని పండితులు సూచిస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారు జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి (Leo)
సింహ రాశివారికి కూడా ఈ నెలలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. అకాల భోజనం, శారీరక శ్రమ తప్పదు. కుటుంబంలో అందరితో గొడవలు సంభవించే అవకాశం ఉంది. మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాహనాన్ని మారుస్తారు. ఉద్యోగులకు బదిలీ తప్పదు. శత్రువులు పొంచి ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ సామర్థ్యం కన్నా ఎక్కువ ఖర్చు చేయవద్దు.
మీన రాశి (Pisces)
మీన రాశివారికి మార్చిలో గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉండడంతో ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయాన్ని వృధా చేయొద్దు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram