Vastu Tips | మీ జీవితమంతా నెగిటివిటేనా..? ఉప్పుతో చెక్ పెట్టండిలా..!
Vastu Tips | వంటకాల్లో ఒక మోతాదులో వినియోగించే ఉప్పు( Salt ).. జీవితానికి కూడా ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుందట. జీవితంలో నెలకొన్న నెగిటివిటిని ఉప్పు తొలగిస్తుందట. అయితే ఇందుకోసం సైంధవ లవణం( Rock Salt ) వాడితే మరింత మంచిదని పండితులు సూచిస్తున్నారు.

Vastu Tips | ఉప్పు ( Salt ).. ఈ పదార్థం లేకుండా ఏ వంటకం కూడా తయారు చేయలేం. ఎందుకంటే.. ఇదిని రుచిని ఇస్తుంది. ఉప్పు వినియోగించకుండా ఎంత అద్భుతంగా వండినా.. అది రుచి లేకుండా పోతోంది. కాబట్టి వంటకానికి ఉప్పు తప్పనిసరి. అందుకే ఉప్పు లేని పప్పు తినకూడదు అని పెద్దలు అంటుంటారు. అయితే ఉప్పు కేవలం రుచిని మాత్రమే ఇవ్వదు.. జీవితంలో ఏర్పడిన సమస్యలను కూడా తొలగిస్తుందని జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నెలకొన్న నెగిటివిటిని ఉప్పుతో దూరం చేయొచ్చని పేర్కొంటున్నారు. ఆ పద్ధతుల్లో ఏంటో తెలుసుకుందాం.
కుటుంబ సభ్యులతో విబేధాలా..?
ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒకచోట విబేధాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారు సైంధవ లవణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా చిన్న గిన్నెలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో విబేధాలను తొలగించి, అనుబంధాలను పెంపొందిస్తుందట. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు మరింత బలోపేతం అవుతాయట.
పిల్లలపై చెడు దృష్టి నుంచి కాపాడుతుంది..
ఇంట్లో ఉన్న చిన్న పిల్లలపై అప్పుడప్పుడు చెడు దృష్టి పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఉప్పుతో పిల్లలకు దిష్టి తీసి ఆ ఉప్పును నిప్పుల్లో వేసి కాల్చడం లేదా బయటకు పడేస్తుంటారు. ఇలా ఉప్పు చెడు దృష్టిని కాపాడుతుందని పండితులు చెబుతున్నారు.
వాస్తు దోషాలకు ఉప్పుతో చెక్..
ఉప్పుతో వాస్తు దోషాలను కూడా తొలగించుకోవచ్చట. ఉత్తరం లేదా ఈశాన్యం వైపున బాత్రూమ్‌లు ఉండకూడదు. ఒక వేళ ఆ దిశల్లో బాత్రూమ్‌లు ఉంటే గిన్నెలో ఉప్పు తీసుకుని ఆయా దిక్కుల్లో ఉంచాలట. దీంతో ఆ ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయట.
మానసిక సమస్యలకు కూడా ఉప్పుతో చెక్..
కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా లేదంటే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఒక గిన్నెలో ఉప్పు నింపి అనారోగ్యంతో ఉన్నవారికి దగ్గరగా పెడితే వారిలోని నెగెటివిటిని తొలగించి వారు త్వరగా కోలుకునేందుకు దోహదం చేస్తుంది.
నెగెటివ్ ఆలోచనలు తొలగిస్తుంది..
నెగెటివ్ ఆలోచనలు అదేపనిగా వేధిస్తుంటే ఒక చిటికెడు సైంధవ లవణం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా ఇలాంటి ఆలోచనలు తగ్గి సంతోషకరమైన జీవితం లభిస్తుంది. ఇలా ఉప్పుతో నెగిటివిటిని తొలగించుకొని పాజిటివిటికి దగ్గర కావొచ్చు.