Today Horoscope | ఈ రాశి నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది..?
చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. పనులు ఆలస్యమైనా విజయవంతంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. తగిన విశ్రాంతి అవసరం.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కష్టించి పనిచేసి, అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు తెలివిగా వ్యవహరిస్తే మంచిది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సుఖశాంతులు నెలకొంటాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తరచుగా వచ్చే ప్రతికూల ఆలోచనలతో నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. పనులు సకాలంలో పూర్తికాక ఇబ్బంది పడతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. మీ ప్రగతి మార్గంలో ఉన్న అవరోధాలను తొలగించుకుంటారు. కొత్త పనులు, బాధ్యతలు వస్తాయి. కుటుంబ సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, జీవిత భాగస్వామి సహకారంతో సులభంగానే పరిష్కారమవుతుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ మొండితనం, కోపస్వభావం కారణంగా ఎంతో నష్టపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే శత్రువులు పెరుగుతారు. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవదర్శనం కోసం వెళతారు. అన్ని రంగాల వారికి గురుబలం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలతో వ్యవహరించాలి. అందరికీ మార్గదర్శకంగా ఉంటారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి దిగజారిపోవడమే వీటన్నింటికి కారణం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం అధికంగా ధనవ్యయం ఉండవచ్చు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం బాగుటుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది. మీ పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తారు. చేపట్టిన అన్ని పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా, బయటా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.