Vontimitta Seetha Ramaswamy Kalyanam | ఒంటిమిట్టలో నేడు వెండి వెన్నెల్లో సీతారాముల కల్యాణం.. రాత్రే ఎందుకంటే..?
vontimitta seetha ramaswamy kalyanam | ఒంటిమిట్ట సీతారామ చంద్రస్వామి కల్యాణోత్సవం సోమవారం జరుగనున్నది. సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య సీతారాముల కల్యాణ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. సాధారణంగా సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు ఇతర ఆలయాలతో పోలిస్తే ఒంటిమిట్టలో ప్రత్యేకంగా జరుగుతుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా ఏ రామాలయంలో చూసినా జానకీరాముల కల్యాణం చైత్ర మాసం నవమి రోజు పగలు జరిగితే. .ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు, వెన్నెల వెలుగుల్లో జరుగుతుంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. జాంబవంతుడు ఇక్కడ ఓ కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసినట్లుగా స్థల పురాణం చెబుతున్నది.
 
                                    
            vontimitta seetha ramaswamy kalyanam | ఒంటిమిట్ట సీతారామ చంద్రస్వామి కల్యాణోత్సవం సోమవారం జరుగనున్నది. సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య సీతారాముల కల్యాణ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. సాధారణంగా సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు ఇతర ఆలయాలతో పోలిస్తే ఒంటిమిట్టలో ప్రత్యేకంగా జరుగుతుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా ఏ రామాలయంలో చూసినా జానకీరాముల కల్యాణం చైత్ర మాసం నవమి రోజు పగలు జరిగితే. .ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు, వెన్నెల వెలుగుల్లో జరుగుతుంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. జాంబవంతుడు ఇక్కడ ఓ కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసినట్లుగా స్థల పురాణం చెబుతున్నది.
జాంబవంతుడి చేతుల మీదుగా..
జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడని.. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం. ఒంటిమిట్టను ఏకశిలానగరమని పేరుంది. సీత, రామ, లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా చెక్కారు అందుకే ఏకశిలా నగరం అనే పేరువచ్చింది. ఆ ఏకశిలకు దగ్గరలోనే మృకండుడు అనే మహర్షి తపస్సు చేసుకునేవారని.. రాములవారు అరణ్యవాసంలో భాగంగా కొద్ది రోజులు మృకండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. అయితే, ప్రతి రామాలయంలో ఆంజనేయస్వామి కనిపిస్తుంటాడు. కానీ, ఆలయంలో ఆంజనేయస్వామి కనిపించకపోవడం ఇక్కడ మరో ప్రత్యేకత. రాములవారు ఆంజనేయుడిని కలవక ముందే ఇక్కడకు వచ్చారనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉండదని చెబుతుంటారు.
సీతారాముల కల్యాణం విశేషం..
వాస్తవానికి శ్రీరామనవమి రోజు జరిపించాల్సిన కల్యాణం చైత్ర పౌర్ణమి రోజున జరిపించడం విశేషం. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుడి ఊరడించేందుకు.. రాములవారు ఇక్కడ రాత్రివేళ కల్యాణం జరిగేలా వరాన్నిచ్చాడని చెబుతారు. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టినట్లుగా చెబుతారు. కారణం ఏదైనా మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం పున్నమి కాంతుల్లో జరగడం విశేషం.

కల్యాణ వేదిక
ఏర్పాట్లు పూర్తి
సీతారాముల కల్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్నప్రసాదాలు, తాగునీరు విద్యుత్, పుష్పాలంకరణలు, భద్రత, సౌండ్ సిస్టమ్, ఎల్‌ఈడీ టీవీలను టీటీడీ ఏర్పాటు చేసింది. నిఘా, భద్రత విభాగం జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా వేదిక వద్ద బారికేడ్లు, రోప్‌లు, మెగా ఫోన్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో కల్యాణ వేదిక వద్ద శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, ఒక్కో గ్యాలరీకి వర్కర్లను నియమించింది. లక్షకుపైగా మజ్జిగ, నాలుగు లక్షలకు పైగా వాటర్ పాకెట్లను సిద్ధంగా ఉంచారు. దాదాపు 580 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు 280 మంది కార్మికులు, సూపర్‌వైజర్లు రుచికరమైన అన్నప్రసాదాలు తయారు చేయనున్నారు. ఇందులో పులిహోర, చక్కర పొంగలి ఒక్కొక్కటి 50 వేల ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు. వీటిని కల్యాణం రోజున 150 అన్నప్రసాద పంపిణీ కౌంటర్లలో భక్తులకు అందిస్తారు. ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, 28 ఎల్ ఈడి స్క్రీన్‌లు, హై-ఫై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, గ్యాలరీలలో ఉండే భక్తులకు వేసవి ఉపశమనం కోసం 200కి పైగా ఎయిర్ కూలర్‌లు ఏర్పాటు చేశారు.
సంప్రదాయ పుష్పాలతో..
కల్యాణ వేదికను 30 వేల కట్ ఫ్లవర్‌లతో సహా నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలతో తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరిస్తున్నారు. దాదాపు 100 మంది నిపుణులు రెండు రోజులుగా పుష్పాలంకరణలు చేస్తున్నారు. కల్యాణానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసేందుకు. టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు గ్యాలరీలకు ఇరువైపులా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించనున్నారు.
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram